బెంగళూరు, ఆగస్టు 10: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్.. తాజాగా యాక్సిస్ ఎనర్జీతో జట్టుకట్టింది. 2032 నాటికి 20 గిగావాట్ల బ్యాటరీ ఎనరీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
యుటిలిటీ-స్కేల్, సీఅండ్ఐ ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్ఫామ్లో తొలి ఒప్పందం ఇదేనని పేర్కొంది. 2028 తర్వాత ప్రతియేటా 5 గిగావాట్ల వరకు వార్షిక సామర్థ్యాన్ని పెంచుకోనున్నది.