న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ డుకాటీ..దేశీయ మార్కెట్లోకి మరో రెండు మాడళ్లను తీసుకొచ్చింది. మాన్స్టర్ 2026 వెర్షన్‌ను దేశీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు పేర్కొంది. ఆరు రకాల్లో లభించనున్న ఈ స్పోర్ట్స్ బైకు ప్రారంభ ధర రూ.13.99 లక్షలు కాగా, గరిష్ఠంగా 14.45 లక్షలుగా నిర్ణయించింది.
890 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ స్పోర్ట్స్ బైకులు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద లభించనున్నాయని కంపెనీ ఎండీ బిపుల్ చంద్ర తెలిపారు. వీ2 ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో తయారైన ఈ బైకులను యువతకు నచ్చే విధంగా డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోపాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి.