
తాడూరు, ఆగస్టు 21 : మండలంలోని సిర్సవాడలో రైతు వేదిక, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక తదితర నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో రైతువేదిక నిర్మాణం, వైకుంఠధామం, కంపోస్టుషెడ్ తదితర నిర్మాణాలను సకాలంలో పూర్తిచేశామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇబ్బందులు ఉన్న వార్డుల్లో సీసీరోడ్లు వేశామని, అండర్ డ్రైనేజీ పనులతోపాటు తదితర అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇంకా గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఎల్ఈడీ లైట్లకోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారన్నారు. వారం పదిరోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. మండలంలోనే సిర్సవాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు.