e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home జిల్లాలు పీసీసీ రేవంత్‌రెడ్డి .. నోరు అదుపులో పెట్టుకో

పీసీసీ రేవంత్‌రెడ్డి .. నోరు అదుపులో పెట్టుకో

  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
  • సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం
  • అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ
  • ఓటుకు నోటు దొంగకు పీఠమని విమర్శ

మక్తల్‌ టౌన్‌, అక్టోబర్‌ 14 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, అలీబాబా దొం గకు పీసీసీ పీఠం ఇచ్చినట్టు ఉందని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామని, వర్షాలు పడుతూ తెలంగాణ అభివృద్ధికి దేవుడు కూడా కరిణిస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటుకు నోటు దొంగను పీసీసీగా ని యమించిందన్నారు. చంద్రబాబు సంకలో ఉంటు ఆంధ్ర బుద్ధ్దిని చూపిస్తూ బెయిల్‌పై తిరుగుతూ సీఎం కేసీఆర్‌పై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఎవరు ఊరుకోరని, సీఎంను ఎ వరైనా అంటే నాలుక కోస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రూ.30కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్న నువ్వు నోరు అదుపులో పెట్టుకొ ని మాట్లాడితే మంచిదన్నారు. పార్టీ రాష్ట్ర అ ధ్యక్షుడి హోదాలో ఉండి అమర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడడం చెల్లదన్నారు. సీ ఎం కేసీఆర్‌ తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌ లు పూర్తి చేసుకున్నామన్నారు. చంద్రబాబు హయాంలో వానలు లేవని, పంటలు లేవని, కరెంట్‌ తీగలకు బట్టలు ఆరేసుకోవచ్చాన్నారు. సీఎం కేసీఆర్‌ దేశాన్ని శాసిస్తున్నాడన్నారు. షబ్బీర్‌ అలీ సీఎం కేసీఆర్‌ కాలిగోటికి సమానం కా వని చిట్టెం అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ రాజేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ టౌన్‌ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement