ఎల్బీనగర్ : కాలుష్య రహిత రాష్ట్రం కోసం అందరం పాటుపడదామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ది సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ చెరువు కట్టపై నిర్వహించిన ర్యాలీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాల బాగు కోసం పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని అన్నారు. ప్రతి ఏడాది కాలుష్యంతో ప్రపంచ మానాళికి జరిగే నష్టాన్ని తెలియజేసేందుకే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
జీవనాధారమైన గాలీ, నీరు, భూమిని కలుషితం చేస్తూ మనిషి దానిలో తానే కాలిపోతూ భవిష్యత్తును అందకారంగా మారుస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, ప్రేంనాథ్ గౌడ్, రమేష్ ముదిరాజ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, వరప్రసాద్ రెడ్డి, తిలక్‌రావు, శ్రీధర్ గౌడ్, భాస్కర్, శ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, ది సురక్ష ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు సాయికుమార్, మౌనిక, చరిత, ప్రీతం, సాగర్, అఖిల్, వంశీ, మనీష్, మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.