వనస్థలిపురం : ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్టును కాపాడుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వేపచెట్టుకు డై బ్యాక్ తెగులు వచ్చి గత కొంతకాలంగా ఎండిపోతున్న విషయం విదితమే. మంగళ వారం చింతలకుంటలో వేపచెట్టుకు చికిత్సా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
డ్రోన్ల సహాయంతో రసాయనాలను పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేపచెట్టు మన దేశానికే గర్వకారణమన్నారు. తెగులు వచ్చిన చెట్ల వివరాలను అధికారులకు తెలపాలని, చికిత్స చేసి కాపాడుతారన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భావన శ్రీనివాస్, జగన్మోహన్, సత్యనారాయణ, రాము, లింగేశ్వర్, మంగపతిరావు, రాజ్‌కుమార్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.