బేగంపేట్ : కృషితంత్ర వ్యవసాయ రంగంలో ఒక సామాజిక ప్రభావం చూపే సంస్ధ అని నాబార్డ్ సీజీఎం నీరజ్‌కుమార్ అన్నారు. మంగళవారం బేగంపేట్‌లోని సంస్ధ కార్యాలయంలో కృషి తంత్ర వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృషితంత్ర ద్వారా రైతులను సాధారణ వ్యవసాయం నుంచి ఆధునిక వ్యవసాయ మార్గంలోకి ఎలా తీసుకెళ్లాలి అన్న అంశంపై మాట్లాడారు.
దీనితో రైతు ఆదాయ ఉత్పత్తి మార్గాలను పెంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కృషికల్ప సీఈవో సీఎం పాటిల్ మాట్లాడుతూ రైతు పండించే పంటలకు సహకారం అందించడం, వారి ఉత్పత్తిని పెంచడం వంటి అంశాలను వివరించారు. దేశంలో మెజారీటి రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, కాబట్టి వారి భూసార పరీక్షలు నిర్వహించి వారి భూమికి తగిన పంటను సూచించడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎఆర్-ఐఐఆర్ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సాయిల్ తదితరులు పాల్గొన్నారు.