ములకలపల్లి, మే 9: పురుగుల మం దు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండ లం సీతారాంపురం పంచాయతీ ధర్మన్ననగర్కు చెందిన వూకే దేవి(18), ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తురకలగూడేనికి చెందిన మడకం సోనా(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి జిల్లాకు వలస వచ్చాయి. వీరిద్దరూ సమీప బంధువులు. ఇటీవల యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రేమికుడితో కలిసి మూడు రోజుల క్రితం వెళ్లిపోయా రు. సోమవారం రాత్రి అన్నారం శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పురుగుల మందు డబ్బాను గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం పాల్వంచ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.