ఖమ్మం:మార్కెట్‌కు సెలవులుఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు ఆల్‌టైం రికార్డు ధర పలికింది. శనివారం పత్తియార్డుకు రైతులు 1300 బస్తాలను తీసుకొచ్చారు. ఆన్లైన్ బిడ్డంగ్లో పంటను సొంతం చేసుకునేందుకు స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో గరిష్ట ధర క్వింటాకు రూ.13,050 పలికింది. కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన రామా రాంబాబు, కొణిజర్ల మండలానికి చెందిన రాములు అనే రైతుల పంట ఉత్పత్తులకు దేశంలోనే అత్యధిక ధర పలికింది. ఈ నెల16 నుంచి పక్షం రోజులపాటు మార్కెట్లో క్రయవిక్రయాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో వ్యాపారులు పోటీపడి మరీ పంటను కొనుగోలు చేస్తున్నారు.