ధర్మపురి, ఏప్రిల్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పో చా రం శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషర్ ఆధ్వర్యంలో ధర్మపురి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ముం దుగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, గాయని వొల్లాల వాణి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ధర్మపురిని చాలా ఏండ్ల తర్వాత సందర్శించానని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు చెందిందన్నారు. ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని, అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇప్పటికే కోట్లాది నిధులు కూడా మంజూరుచేసినట్లు గుర్తు చేశారు. పనులన్నీ పూర్తయితే మరో యాదాద్రిగా మారుతుందన్నారు. తాను ఎంతో మంది సీఎంల నాయకత్వంలో పని చేశానని, కా నీ కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన తృప్తి మరువలేనిదన్నారు. తె లంగాణ కొత్త రాష్ట్రమైనా అభివృద్ధిలో దూసుకెళ్తున్నదన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ గాయని వాణి పాడిన పాట వింటే వేదికపై ఆడాలనిపించిందని చెప్పుకొచ్చారు. ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ పేరిట ఈ శ్వర్ సతీమణి సేవలు అభినందనీయమన్నారు..
కరోనాతో ప్రజలు రెండేళ్లుగా ఇబ్బందులు పడ్డారనీ, ఆ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి వివిధ రంగాల్లో సేవలందించినవారిని ‘చంద్రునికో నూలు పోగు’ అన్న చందంగా సన్మానించుకోవడానికే పురస్కారాల ప్రధానోత్సవాన్ని చేపట్టినట్లు మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. వివిధ రంగా ల్లో సేవలందించిన వారికి పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ప్రజలను ఉర్రూతలూగించిన గా యని వాణిని సన్మానించడంతో పాటు రూ.50 వేల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. అలాగే 2015 పుష్కరాల సమయంలో అన్నదానం చేసిన అమర్నాథ్ స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన సేవలు కూడా మరువలేనివనీ, ఈ వేదిక మీదుగా వారిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. కాగా స్పీకర్ పోచారం ఆధ్వర్యంలో మంత్రి ఈశ్వర్ దంపతులను గజమాలతో సన్మానించారు. అనంతరం స్పీకర్ పోచారంను మంత్రి ఈశ్వర్ సత్కరించారు.