నిరుద్యోగ అభ్యర్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రసర్కారు ప్రోత్సహిస్తున్నది. ఉద్యోగార్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా,
మంత్రి కేటీఆర్ చొరవతో తాజాగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు ఒక కేంద్రం మంజూరైంది. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయబోతుండగా, ఆన్లైన్ ఎగ్జామ్‌లో మెరిట్ ఆధారంగా మొదట వంద మందికి శిక్షణ ఇవ్వనున్నది.
సిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 15: ఉద్యోగార్థుల కలను నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు భారీ నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు చేస్తూనే, ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు ఒక కేంద్రం మంజూరైం ది. ఈ స్టడీ సెంటర్లో శిక్షణకు ఆన్లైన్ ఎగ్జామ్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా 100 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 16 వ తేదీ ఉదయం 10 గంటల వరకు http// tsbcstud ycircle.cgg.gov.in దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత అదే లింక్‌లోకి వెళ్లి నే రుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెరిట్ సాధించిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం చ క్కని అవకాశం కల్పిస్తున్నది. విరివిగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తు న్నది. గంభీరావుపేట డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేయనున్న సెంటర్లో గ్రూప్ 1, 2 పరీక్షలకు అర్హత పొందిన 100 మందికి కోచింగ్ ఇస్తారు.
– పీ దాస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్