గోదావరిలోకి 18,720 క్యూసెక్కుల నీటి విడుదల
ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
మెండోరా, (ముప్కాల్ ): ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తివేసి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతున్నా రు. ఉదయం నుంచే ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగింది. 23 వేల 869 క్యూసెక్కులతో ఇన్ఫ్లో మొదలు కాగా, రాత్రి తొమ్మిది గంటల వరకు 15,760 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. రాత్రి 9.30 గంటలకు ఆరు గేట్లను ఎత్తి గోదావరిలోకి 18, 720 క్యూసెక్కుల నీటివిడుదలను ప్రారంభించినట్లు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. మహారాష్ట్రలోని బాలేగా వ్ ప్రాజెక్టు నుంచి దిగువకు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 35 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఈ నెల 20వ తేదీన ఏడుగేట్లను తాజాగా ఆదివారం రాత్రి ఆరు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం రాత్రి 1090. 8 అడుగుల (89.212 టీఎంసీ లు) వద్ద ఉన్నది. కాకతీయ ప్రధాన కాలు వ ద్వా రా 3500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వా రా 4000 , జెన్కోకు 7500 , లక్ష్మీ కాలువకు 180 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నది.