కొడవలితో దాడి, ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
గద్వాల మండలం పూడురులో కలకలం
ఘటనా స్ధలాన్ని పరిశీలించిన డీఎస్పీ
గ్రామంలో పోలీసు పికెటింగ్
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 20 : ప్రశాంతంగా ఉన్న గ్రా మంలో కల్లం(గుడిసెల) పంచాయితీ చిచ్చురేపింది. ఏం డ్లుగా పరిష్కారానికి నోచుకోని ఈ గొడవ రెండు వర్గాల మధ్య భగ్గుమన్నది. ఇందుకు సంబంధించిన భూమి మాకే దక్కాలని ఒక వర్గం.. కాదు మాకే అంటూ మరో వర్గం కో ర్టు నుంచి స్టే తీసుకున్నారు. ఇది జీర్ణించుకోలేని మరో వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య కయ్యానికి దారి తీయగా.. చివరకు ఒకరిని కడతేర్చిన ఘటన పూడురు గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. పూడురు శివారులోని సర్వే నెం.1472లో 7 ఎకరాల 14 గుంటల భూమి లో అదే గ్రామానికి చెందిన బోయ బీసన్న వారసులైన బో య వీరభద్రుడు (55), సంజన్న వారసులైన రాఘవేంద్ర ల మధ్య కల్లల పంచాయితీ కొన్నేళ్లుగా చోటు చేసుకున్నది. ఈ క్రమంలో రాఘవేంద్ర కోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రుడు, మరికొందరు రైతులు కలిసి కోర్టును ఆశ్రయించారు. అయి తే ఈ స్థలంలోకి ఎవరూ వెళ్లవద్దని కోర్టు స్టే విధించింది. శుక్రవారం కొందరు రైతులతో కలిసి వీరభద్రుడు భూమిని చదును చేసుకుంటుండగా.. ఈ విషయం తెలుసుకున్న రా ఘవేంద్ర అక్కడికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగాడు. దీం తో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. దీంతో ఆవేశానికి లోనైన రాఘవేంద్ర కొడవలితో వీరభద్రుడి మేడపై నరకగా అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న వీరభద్రుడు బంధువులు రాఘవేంద్ర వర్గమైన వెంకటస్వామి, విష్ణుతోపాటు మరికొందరిపై దాడి చేశారు. వెంకటస్వామి, విష్ణుకు తీవ్ర గా యాలయ్యాయి. వీరిని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ యాదగి రి, సీఐ మహబూబ్‌బాషా, రూరల్ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, గద్వాల టౌన్ ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య వివరాలు సేకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇద్దరు ఎస్సైలతోపాటు సిబ్బందిని నియమించి పికెటింగ్ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. వీరభద్రుడు మృతదేహానికి గద్వాల దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు.