నేడు ఎదుర్కోళ్లు.. రేపు కల్యాణం
ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
వేలాదిగా తరలిరానున్న భక్తులు
విద్యుద్దీపాల కాంతుల్లో జములమ్మ ఆలయం
గద్వాలటౌన్, ఆగస్టు 29 : నడిగడ్డ ఇలవేల్పుగా విరాజిల్లుతూ అఖండ భక్త జనంతో పూజలందుకుంటున్న జములమ్మ అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు పాలక మండలి శ్రీకారం చు ట్టింది. మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయాన్ని అన్ని వి ధాలా ముస్తాబు చేశారు. అమ్మవారు వెలిసిననాటి నుంచి మాఘమాసంలో అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది నూతనంగా కొలువుదీరిన పాలక మం డలి అమ్మవారి కల్యాణోత్సవానికి తొలిసారి శ్రీ కారం చుట్టింది. కల్యాణోత్సవంలో భాగంగా సో మవారం సాయంత్రం 6గంటలకు ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే గణపతి పూజ, దేవతాహ్వానం, అంకురార్పణ తదితర పూ జలు ఉంటాయి. మంగళవారం ఉదయం 11.45 నిమిషాలకు జమదగ్ని, జములమ్మల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. బుధవారం అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజ రై పట్టు వస్ర్ర్తాలను అమ్మవారికి సమర్పిస్తారు. కల్యాణోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. కొ విడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం నాలుగో మంగళవారం అ మ్మవారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.