నాకు నీవు రక్ష…నీకు నేను రక్ష
ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
సోదరులకు రాఖీలు కట్టిన సోదరీమణులు
గద్వాలటౌన్ ఆగస్టు 22 : నేను నీకు రక్ష.. నాకు నువ్వు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రక్ష కట్టుకుంటూ అన్నాదమ్ములు, అక్కాచెల్లెండ్లు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రక్షాబంధన్ ప్రత్యేకతను చాటారు. ఆదివారం శ్రావ ణ పౌర్ణమిని పురస్కరించుకుని రాఖీపండుగను జిల్లా కేం ద్రంలో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కాచెల్లెండ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు పలికారు.
కృష్ణమ్మకు హారతి..
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని పూర్ణ నదీహారతి సేవా సంఘం ఆధ్వర్యంలో నదీఅగ్రహారం వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో వాయినం, మహాహారతిని సమర్పించారు. కార్యక్రమంలో సేవా సంఘం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
శ్రావణ పూర్ణిమను పురస్కరించుకొని భక్త మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక రథంపై వీధుల గుండా ఊరేగించారు. అలాగే అహోబిల లక్ష్మీనృసింహ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నమయ్య సంకీర్తలు ఆలపించారు. కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో విశిష్టపూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన ఆడపడుచులు
గద్వాల అర్బన్, ఆగస్టు 22 : రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన ఆడపడుచులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అండదండలతో చిరకా లం ప్రజాసేవలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.
మున్సిపల్ చైర్మన్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి
గద్వాల అర్బన్, ఆగస్టు 22 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌కు, ఉమ్మడి జిల్లా సింగిల్ విండో డైరెక్టర్ ఎంఏ సుభాన్కు ఆదివారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
మల్దకల్ మండలంలో..
మల్దకల్, ఆగస్టు 22 : అన్నా చెల్లెండ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ . ఆదివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఎంతో ఉల్లాసంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అక్క తమ్ముడికి, అన్నకు చెల్లెలు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం వారు తమ చెల్లెళ్లకు, అక్కలకు తమకు తోచినంత డబ్బులు, చీరలు, స్వీట్లు ఇచ్చి వారిని సంతృప్తి పరిచారు.
ఉండవెల్లి మండలంలో..
ఉండవెల్లి, ఆగస్టు 22 : మండలంలోని ఆయాగ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అన్నాచెల్లెండ్లు, అక్కాతమ్ముండ్లు ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆడపడుచులు స్వగ్రామాలకు చేరుకొని సోదరులకు రాఖీ కట్టి పుట్టినిల్లు, మెట్టినింట్లో సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వాదం తీసుకున్నారు.
అయిజ మండలంలో..
అయిజ, ఆగస్టు 22 : అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి అనుబంధాన్ని పంచుకున్నారు. పట్టణంలోని పలు దుకాణాల్లో ప్రజలు రాఖీలను కొనుగోలు చేశారు.
ఎర్రవల్లి చారస్తాలో..
ఎర్రవల్లి చౌరస్తా,ఆగస్టు 22 : ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి, యాక్తపూర్, కొండపేట, తిమ్మాపూర్, షేక్‌పల్లి, శాసనూలు, దువాసిపల్లి, గార్లపాడు, ఎర్రవల్లి చౌరస్తా తదితర గ్రామాల్లో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవల్లి చౌర స్తాలో కులమతాలకు అతీతంగా యువతి ముస్లిం సోదరు డికి రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు.
గట్టు మండలంలో..
గట్టు, ఆగస్టు 22 : మండలకేంద్రంతోపాటు అన్ని గ్రా మాల్లో రాఖీ పౌర్ణమిని ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. అక్కాచెల్లెండ్ల్లు అన్మాదమ్ముళ్లకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. శ్రావణపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేటీదొడ్డి మండలంలో..
కేటీదొడ్డి, ఆగస్టు 22 : అన్నాచెల్లెండ్ల బంధానికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగ రాఖీ పౌర్ణమిని మండలకేంద్రంతోపాటు గ్రా మాల్లో ఘనంగా జరుపుకొన్నారు. మహిళ లు అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టి, మంగళ హారతులు ఇచ్చి స్వీట్లు తినిపించారు.
మానవపాడు మండలంలో..
మానవపాడు,ఆగస్టు 22 : మండలంలో ని ఆయా గ్రామాల్లో ఆదివారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అక్కాచెల్లెండ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు.