గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీశ్‌గౌడ్
ఘనంగా సర్వాయి పాపన్నగౌడ్ జయంతి
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు
ఊట్కూర్, ఆగస్టు 18 : తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఉద్యమ స్ఫూ ర్తితో గౌడ కులస్తులు సామాజిక సేవలో భాగస్వాములు కా వాలని గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీశ్‌గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక మెయిన్ బజార్ హనుమాన్ మందిరం లో సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించారు. గౌడ సం ఘం నాయకులు, గీత కార్మికులు పాల్గొని పాపన్నగౌడ్ చి త్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్‌గౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని ఖిళాస్పూర్లో 1650 ఆగస్టు 18న జన్మించిన పాపన్నగౌడ్ నాటి మొగల్ పాలనకు వ్యతిరేకంగా ఉ ద్యమించాడన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నా యకులు ఆనంద్‌గౌడ్, బాలరాజుగౌడ్, వెంకటేశ్గౌ డ్, నారాయణగౌడ్, శాంతుకుమార్గౌడ్, వీరేశ్‌గౌడ్, నవీన్‌గౌడ్, రఘుగౌడ్, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో…
ధన్వాడ, ఆగస్టు 18 : మండలంలో గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జ యంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పాపన్న చిత్రపటాన్ని ఏర్పా టు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, గౌడ సంఘం నాయకులు లక్ష్మయ్యగౌడ్, సుదర్శన్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, రాజేశ్‌గౌడ్, రా ఘవేందర్గౌడ్, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, ఆగస్టు 18 : తెలంగాణలో మొగలాయిల విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్ననే అ ని మాజీ సర్పంచ్ భీమయ్యగౌడ్ అన్నారు. మండలకేంద్రంలో పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎంపీపీ బక్క నర్సప్ప, ప్రభాకర్, అశోక్‌గౌడ్, రవికుమార్, గోపాల్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
పాపన్న బహుజన విప్లవ వీరుడు
మక్తల్ టౌన్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న బ హుజన విప్లవ వీరుడని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌ డ్, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని ఐ బీ అతిథి గృహంలో కల్లు గీత పారిశ్రామిక కార్మిక సంఘం మక్తల్ శాఖ అధ్యక్షుడు సోంభూపాల్‌గౌడ్ ఆధ్వర్యంలో పా పన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, మాజీ మార్కెట్ కమి టీ చైర్మన్ నర్సింహాగౌడ్, శేఖర్‌గౌడ్, నీలగౌడ్, మారుతిగౌ డ్, గోపిగౌడ్, జగదీశ్‌గౌడ్, పవన్‌గౌడ్, కల్లు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో …
నారాయణపేట టౌన్, ఆగస్టు 18 : పాపన్న జయంతిని పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌గౌడ్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, సతీ శ్, వెంకటేశ్, సత్యనారాయణ, శ్రీనివాస్, కృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.