ఉచిత చేపపిల్లలతో ఆర్థికంగా అభ్యున్నతి
జల సంపదతోపాటు మత్స్య సంపదనూ పెంచుతాం
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి జిల్లాలోని పలు చెరువుల్లో చేపపిల్లలు విడుదల
గోపాల్పేట, సెప్టెంబర్ 9 : ప్రభుత్వం చేపట్టిన వివి ధ పథకాలతో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాల కు భరోసా ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం గోపాల్పేట క త్వ చెరువులో 1.20 లక్షలు, పొల్కెపహాడ్-మొగుళ్ల చె రువులో 60 వేలు, బుద్ధారం పెద్ద చెరువులో లక్షా 20 వేల చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల సంపదతోపాటు మత్స్యసంపదను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న చేపపిల్లలతో మత్స్య సంప ద పెంపొందుతున్నదన్నారు. సంబంధిత కుటుంబాలు ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చాకే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నా రు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ వెంకటయ్య, ఫీల్డ్ ఆఫీసర్ భరత్, ఎంపీడీవో కరుణశ్రీ, జెడ్పీటీసీ భార్గవి, విండో చైర్మన్ రఘుయాదవ్, వైస్ చైర్మన్ రాములు, మత్స్యకారుల సంఘం మండలాధ్యక్షుడు బాలరాజు, గ్రామ అధ్యక్షుడు రాములు, బాలయ్య, శేఖర్, సర్పంచులు శ్రీనివాసులు, రజిని, పద్మమ్మ, ఎంపీటీసీ కేత మ్మ, నాయకులు జానకిరాంరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వర్‌రెడ్డి, కోదండం, శివకుమార్, రాజు, మల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులకు పూర్వవైభవం..
పెద్దమందడి, సెప్టెంబర్ 9 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నా రు. గురువారం వెల్టూర్ గ్రామ చెరువులో మంత్రి చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారులకు అందించే చేప పిల్లలతో ఆర్థికంగా ఎదగాలన్నారు. నేడు మత్స్య సంపద పెరిగి ప్రజలు బలవర్థక ఆహారం లభిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కే సీఆర్ వల్లే రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నా రు. అంతకుముందు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు మన్యపురెడ్డి, దయాకర్, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సత్యారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి..
పెబ్బేరు, సెప్టెంబర్ 9 : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు. మున్సిపల్ పరిధిలోని మహభూపాల్ సముద్రంలో గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల, ఎంపీపీ శైలజ, విండో చైర్మన్ కోదండరాంరెడ్డితో కలిసి లక్షా 32 వేల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉ చిత చేప పిల్లల పంపిణీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఆంధ్రా నుంచి చేపలను దిగుమతి చేసుకునే వారమని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నే డు రాష్ట్రంలోనే విరివిరిగా చేపలు లభిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జిల్లా అధికారి వెంకట య్య, భరత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వా మి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ బుచ్చారెడ్డి, విశ్వరూపం, కౌన్సిలర్లు సుమతి, ఎల్లారెడ్డి, రామకృష్ణ, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు హరిశంకర్ నాయుడు, రాములు, ఉపాధ్యక్షుడు సాయినాథ్, ము న్సిపల్ కోఆప్షన్ సభ్యులు ముస్తాక్, ఐజాక్, మండల కో ఆప్షన్ సభ్యుడు సత్తార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భారతి, బలరాం, నాయకులు మన్యం, గోపాల్ యాద వ్, మత్స్యకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పెరుగుతున్న మత్స్య సంపద..
వనపర్తి రూరల్, సెప్టెంబర్ 9 : నాలుగేండ్లుగా చేప పిల్లలు వదులుతున్నామని, దీంతో రాష్ట్రంలో మత్స్యసంపద పెరుగుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని నల్ల చెరువులో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, నువ్వులు, కుసుమలు, ఆవా లు, పొద్దు తిరుగుడు వంటి నూనె గింజలు సాగు చే యాలని పిలుపునిచ్చారు. నల్లచెరువులోని చెత్తాచెదా రం, ముళ్ల కంపలను తొలగించాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్లను ఆదేశించారు. లేకుంటే స్వయంగా దగ్గరుండి పనులు చేయిస్తానన్నారు. గతంలో 165 ఎకరా ల్లో ఉన్న చెరువు.. అక్రమణకు గురై ప్రస్తుతం 10 ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉందని, దానిని పరిరక్షించుకొని మత్స్యకారులకు జీవనాధరమే కాకుండా జిల్లా వాసులకు పర్యటక కేంద్రంగా మార్చుకుందామన్నారు. మత్స్యకార యువకులకు ఆధారంగా ఉండేలా సొంత డబ్బులతో ప్రైవేట్ బోటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లైసెన్స్ ఇప్పిస్తానన్నారు. చెరువు చుట్టూ వాక్‌వే ఏ ర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 8 చెరువుల్లో 5.40 లక్షల చేప పిల్లలు వదిలామన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌ను మత్స్యకారులు సన్మానించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వెంక య్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, కమిషనర్ మ హేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గ్రంథాలయ సం స్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మత్స్య సహకార సంఘం అ ధ్యక్షుడు కృష్ణయ్య, అంజి, లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవి, కౌన్సిలర్లు మహేష్, శ్యాం, భువనేశ్వరి, పరంజ్యోతి, నాయకులు, మత్స్యకారులు ఉన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం
శ్రీరంగాపురం, సెప్టెంబర్ 9 : అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రంగసము ద్రం, జానంపేట గ్రామంలోని రామ సముద్రంలో మం త్రి 2.60 లక్షల చేప పిల్లలు వదిలారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ జగన్నాథం, సర్పంచులు వినీలారా ణి, వెంకటేశ్వర్‌రెడ్డి, నిర్మల, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటయ్య యాదవ్, నాయకులు, మత్య్సకారులు ఉన్నారు.
మంత్రిని కలిసిన వైద్యబృందం
వనపర్తి రూరల్, సెప్టెంబర్ 9 : జిల్లాలో నూతనంగా మంజూరైన మెడికల్, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాల స్థల పరిశీలన అనంతరం సీఎం ఓఎస్డీ గంగాధర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి, టీఎన్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. భవనాల స్థల పరిశీలన, శంకుస్థాపన తదితర విషయాలపై మంత్రితో ముచ్చటించారు. పూర్తి స్థాయిలో తన సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. కళాశాలల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.