మక్తల్ రూరల్, అక్టోబర్ 7 : ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పుట్టింటి సారెగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. గురువా రం మండలంలోని మంథన్‌గోడ్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఒక ప్రత్యే క గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షే మ పథకాలు చేపడుతున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయ డం శోచనీయమని వనజాగౌడ్ విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, సర్పంచ్ మ హదేవమ్మ, ఎంపీటీసీ సుమిత్ర, ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్, మండలంలోని మాధన్పల్లి, రామ సముద్రం గ్రామా ల్లో సర్పంచుల ఆధ్వర్యంలో చీరెలను పంపిణీ చేశారు.
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఊట్కూర్, అక్టోబర్ 7 : ఆడపడుచుల సంక్షేమానికి ప్ర భుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఓబ్లాపూర్, పగిడిమ ర్రి, వల్లంపల్లి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభు త్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగను నిర్వహిస్త్తున్నదని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి న ఘనత ఎమ్మెల్యే చిట్టెంకే దక్కిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచులు సు లోచన, శంకరమ్మ, నర్సప్ప, మాజీ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అ ధ్యక్షుడు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బతుకమ్మ చీరెలు పంపిణీ
మాగనూర్, అక్టోబర్ 7 : ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరె ల పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని బైరంపల్లి, నేరడగం గ్రామాల్లో జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి సర్పంచులతో కలిసి మహిళలకు చీరె లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, వీఆర్ఏ సునీత తదితరులు పాల్గొన్నారు.
సంతోషంగా నిర్వహించాలి
కృష్ణ, అక్టోబర్ 7 : బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టారని ఎంపీపీ పూర్ణిమపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్ అన్నారు. గురువారం మండలంలోని కుసుమూర్తిలో సర్పంచ్ రేణుక ఆధ్వర్యంలో మ హిళలకు చీరెలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌పాటిల్, ప్రధానకార్యదర్శి మోనే శ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో..
నర్వ, అక్టోబర్ 7 : మండలంలోని ఎల్లంపల్లిలో సర్పం చ్ చెన్నయ్య మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశా రు. రాబోవు రోజుల్లో మహిళలకు మరిన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాధమ్మ, ఉపసర్పంచ్ నాగరా జు, కార్యదర్శి షర్పొద్దీన్, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.