డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు
కొవిడ్ కేంద్రాల పర్యవేక్షణ
18 ఏండ్లు నిండిన వారికి టీకా
ఊట్కూర్, సెప్టెంబర్ 7 : వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి రామ్‌మనోహర్‌రావు అ న్నారు. మంగళవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లను పర్యవేక్షించారు. సి బ్బంది విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు టీకా పట్ల అపోహలు వీడాలని, 18 ఏం డ్లు నిండిన ప్రతిఒక్కరు టీకా వేయించుకోవాలన్నారు. మండలంలోని పగిడిమర్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేం ద్రాన్ని జెడ్పీ ఈసీవో సిద్ధిరామప్ప పర్యవేక్షించారు. టీకాపై ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మల్లేపల్లి, పెద్దజట్రం తదితర గ్రామాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, సూరయ్యగౌడ్, మాణిక్యమ్మ, పీహెచ్సీ వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్‌చంద్ర, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్‌గా వ్యాక్సినేషన్
మక్తల్ రూరల్, సెప్టెంబర్ 7 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా వేయడానికి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీడీవో శ్రీధర్ అన్నారు. మండలంలోని రు ద్రసముద్రం, జక్లేర్, ఉప్పర్‌పల్లి, దాసరిదొడ్డి, పంచలింగా ల, కాట్రేవ్‌పల్లి తదితర గ్రామాల్లో కొవిడ్ సెంటర్లను ఏర్పా టు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మా ట్లాడుతూ గ్రామాల్లో టీకా వేయడానికి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్‌ను సమూలంగా అరికట్టడానికి ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని స్పెషల్ డ్రైవ్ ప్రో గ్రాం నిర్వహించామన్నారు. టీకా వేసుకోవడం వల్ల ఎటువంటి హాని జరుగదన్నారు. సర్పంచులు, ప్రజాప్రతినిధు లు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో పావని, రుద్రసముద్రం సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటయ్య, పంచలింగాల సర్పంచ్ తిక్కమ్మ, వైద్య సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.
డీలర్లకు రెండో డోస్ టీకా
మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్‌షాపు డీలర్లకు రెండో డోస్ టీకా వేశారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పలు గ్రామాల చౌకధర దుకాణాల డీలర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. సరుకులు పంపిణీ చేసే సమయంలో డీలర్లు కొవిడ్ బారిన పడే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా టీకా వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. దీంతో రెండో డోస్ టీకా వేయించుకున్న వారిలో దాసరిదొడ్డి డీలర్ నిజాయినొద్దీన్ అయూబ్, పంచలింగాల డీల ర్ ఉమ, మల్లెపల్లి డీలర్ భీమప్ప తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో టీకా క్యాంపు
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 7 : మండలంలోని జాజాపూర్, సింగారం, చిన్నజట్రం, కోటకొండ, పేరపళ్ల, కొల్లంపల్లి, అభంగపూర్, భైరంకొండ తదితర గ్రామాల్లో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వ ద్ద కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేశారు. ఆయా గ్రామాల్లో ఏఎన్ఎంలు, గ్రామ కార్యదర్శులు టీకా వేయించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించారు. కార్యక్రమంలో జాజాపూర్ రైతుబంధు జిల్లా సభ్యుడు జగన్మోహన్రెడ్డి, సింగారంలో సర్పంచ్ జయంతి, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, సెప్టెంబర్ 7 : మండలంతోపాటు మందిపల్లి, హనుమాన్‌పల్లి, చర్లపల్లి తదితర గ్రామాల్లో కొవిడ్ క్యాం పులు ఏర్పాటు చేసి గ్రామస్తులకు టీకా వేశారు. టీకా కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. 18 ఏండ్లు నిండిన వా రందరూ టీకా వేయించుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి వెంకట్, హెల్త్ సూపర్వైజర్ కతలప్ప, వైద్య సిబ్బం ది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఇంటింటికీ కరోనా టీకా
నారాయణపేట న్యూ టౌన్, సెప్టెంబర్ 7 : కరోనా థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున ఇంటింటికీ టీకా అందిస్తున్నట్లు పట్టణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీరావు అ న్నారు. పట్టణంలోని 24 వార్డులకుగానూ 12 కరోనా సెం టర్లను ఏర్పాటు చేసి కాలనీవాసులకు టీకా వేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.