ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ముసురు
నిండిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు
జూరాల డ్యాం 11 గేట్ల ద్వారా నీటి విడుదల
తెరుచుకున్న సరళాసాగర్ సైఫన్లు
జలసవ్వడితో రైతన్న సంబురం
ఆత్మకూరు/అమరచింత/అయిజ/శ్రీశైలం/దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 7 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ముసురు వర్షం కు రుస్తున్నది. దీంతో చెరువులు, కుంటలు అలుగు లు పారుతున్నాయి. దుందుభీ, ఊకచెట్టు, పెద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి. నీటిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జూరాల ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతున్నది. మంగళవారం రాత్రి 9 గంటలకు 93 వేల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 11 గేట్లు ఎత్తి 72,895 క్యూసెక్కులు విడుదల చేశారు. విద్యుదుత్పత్తికి 30,452, ఎడుమ కాలువకు 348, కుడి కాలువకు 640, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి మొత్తం 1,04,529 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.3 టీఎంసీలు ని ల్వ ఉన్నాయి. ఎగువ జూరాలలో ఒక్కరోజే 3.57 మి.యూ, దిగువ జూరాలలో 4.14 మి. యూ. ఉత్పత్తి చేశారు. దిగువ జూరాలలో 150 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి పూర్తవ్వడంపై వి ద్యుత్ ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 2,849, అవుట్‌ఫ్లో 14,940 క్యూసెక్కులు నమోదైంది. పూర్తి స్థాయి సామ ర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.316 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 43,627 క్యూసెక్కులు నమో దు కాగా, 43,200 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నాయి. ప్రస్తుతం ఆనకట్టలో 10.8 అడుగు లు నిల్వ ఉండగా.. ప్రధాన కాల్వకు 427 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రా జెక్టుకు రాత్రి 9 గంటలకు 1,64,540 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 34,255 క్యూసెక్కులు దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.90 అడుగుల వద్ద నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పాలమూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో 2 గేట్లు తెరిచి దిగువకు 1400 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం వరద తగ్గడంతో ఒక గేటు ద్వారా నీటి విడుదల కొనసాగించారు. ప్రాజెక్టు సామర్థ్యం 2.27 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 2.25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
సరళాసాగర్‌కు జలకళ..
మదనాపురం, సెప్టెంబర్ 7 : సరళాసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. భారీగా కురుస్తున్న పేరూరు, జంగమాయప ల్లి వాగుల నుంచి వరద ప్రాజెక్టుకు చేరడంతో మంగళవారం నాలుగు ఉడ్ సైఫన్స్ రెండు గం టల పాటు తెరుచుకున్నాయి. మారెడ్డిపల్లి వా గు నీరు రామన్‌పాడు జలాశయానికి చేరుకో గా, అధికారులు అప్రమత్తమై రెండు గేట్లు ఎ త్తారు. మదనాపురం రైల్వేగేటు సమీపంలో వరద ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సై తిరుపాజి ఆధ్వర్యంలో పోలీసులు వాహనదారుల ను కట్టడి చేశారు. మదనాపురం-ఆత్మకూరు ప ట్టణానికి దాదాపు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గాక రాకపోకలు కొనసాగించారు.