గిరిజన యువకుడి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్
ఆదుకోవాలని అధికారులకు ఆదేశం
ఆశ్రయం కల్పించిన కలెక్టర్ వెంకట్రావు
నవాబ్‌పేట, సెప్టెంబర్ 7 : మండలంలోని ఊరంచుతండాకు చెందిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారని, వారిని ఆదుకోండి సార్.. ప్లీజ్ అంటూ అదే తండాకు చెందిన ఓ విద్యార్థి చేసిన ట్వీట్‌కు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఊరంచుతండాకు చెందిన జగన్, దేవి దంపతులకు చరణ్(11) మోహన్(6) ఇద్దరు కుమారులు. కాగా ఎనిమిది నెలల కిందట చిన్నారుల తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి జగన్ వికలాంగుడు.. చిన్నారులను పోషించే పరిస్థి తి లేదు. ఈ విషయా న్ని గమనించిన అదే తండాకు చెందిన వి ద్యార్థి రాజేశ్వర్ రాథో డ్.. చిన్నారుల పరిస్థితి ని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ట్వీ ట్ చేశాడు. విషయం తెలుసుకున్న మంత్రి కే టీఆర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. వెంటనే కలెక్టర్ మండల అధికారులకు విషయం తెలియజేయడంతో ఎంపీడీవో శ్రీలత, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి గ్రామానికి చేరుకొని మంగళవారం చిన్నారులను చేరదీసి కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి దుస్తులు అందజేసి.. జిల్లా కేంద్రంలో ని బాలసదనంలో చేర్పించారు. మంత్రి కేటీఆర్ స్పందనకు తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్‌నాయక్, సురేందర్ తదితరులు ఉన్నారు.