2వ తేదీనుంచి 12వరకు మండలస్థాయి కమిటీలు
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ టౌన్,ఆగస్టు 30: టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ఆదేశానుసారం నడుచుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న నిర్వహించే పార్టీ జెండాపండుగ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం నియోజకవర్గంలోని గ్రామ కమిటీల ఎన్నికపై పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే చిట్టెం సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని తెలిపారు. జెండా పండుగ నుంచి నియోజకవర్గంలో గ్రామ కమిటీలు, మున్సిపాలిటీ వార్డు కమిటీలు ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కమిటీల్లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి గడపకు అందేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. 2వ తేదీనుంచి 12వరకు మండలస్థాయి కమిటీలను ఎన్నుకుంటామన్నారు. మండలాధ్యక్షులు గ్రామాల్లో కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తించి పార్టీకి నిరంతరం పనిచేసే యువ నాయకులకు అవకాశం కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్షి, షాదీముబారక్ ద్వారా తెలంగాణ ప్రజలకు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు, మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు ప్రజలకు, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో సినియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, పార్టీ మండలాధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, రమేశ్, నాయకులు రవిశంకర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.