నేటి కాలంలో మోటారు వాహనాలు పెరగడంతో జట్కా బండ్లు అరుదైపోయాయి. అయినా వాటికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదు. గతంలో ప్రజల రవాణా సాధనాలుగా వాడుకలో ఉండేవి. నేడు జనం మెచ్చిన గుర్రపు టాంగాలుగా గుర్తింపు పొందాయి. వీటిని ఎక్కి ప్రజలు మధురానుభూతి పొందడంతోపాటు సరదాగా గడుపుతున్నారు. మరికొందరు మాత్రం వీటిని ఎక్కేందుకు నామోషీగా ఫీలవుతున్నారు. నేటికీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ గుర్రపు బండ్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 10 వరకు జట్కా బండ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి.
గద్వాల, అక్టోబర్ 2 : గుర్రపు బండి (టాంగా) ఎ క్కాలంటే ఎంతో సరదాగా ఉంటుంది. కొందరికి జ ట్కా బండి ఎక్కాలంటే నామోషీగా భావిస్తున్నారు. మరికొందరు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో గుర్ర పు బండ్లకు ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే, య జమానులకు అనుకున్న స్థాయిలో ఆదాయం రావ డం లేదు. దీంతో వారు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్నారు. మిగతా సమయంలో సరుకులు రవాణా చేస్తున్నారు. విమానాలు, రైళ్లు, బస్సు లు.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చాయి. ప్ర యాణికులు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు చేరుకున్న తరువాత ఇండ్లకు వెళ్లేందుకు ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. కాగా, గద్వాలలో మాత్రం కొంతమంది సరదాగా గుర్రపు బండెక్కి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. గతంలో జిల్లాలో ప్రజలకు రవాణా సాధనాలుగు గుర్రపు బండ్లు ఉండేవి. సుమారు 20 వరకు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గద్వాల పట్టణంలో 20 ఏండ్ల కిందట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా టాంగాలే కనబడేవి. అక్కడక్కడ ఆటో రిక్షాలు కనిపించేవి. ప్రయాణికులు బస్సు, రైలు దిగినా.. లేదా బస్టాండ్, రైల్వేస్టేషన్లకు చేరుకోవాలన్నా టాంగాలను ఆశ్రయించేవారు. వాటిని ఎక్కాలంటే ఎంతో ఆసక్తి కనబర్చేవారు. గద్వాల, మానవపాడు, జల్లాపురం, అలంపూర్ తదితర ప్రాంతాల్లో టాంగాల ద్వారా ప్రజలు రైల్వే స్టేషన్లకు చేరుకునే వారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది ఆటోలు, జీపులు వచ్చాయి. అయినప్పటికీ కొంత మంది ప్రయాణికులు టాంగాలపై వెళ్లాలంటే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం గద్వాల నియోజకవర్గంలో 4, అలంపూర్ నియోజకర్గంలో 6 గుర్రపు బండ్లు ఉన్నాయి. పదేండ్ల కిందట రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు సంపాదన ఉండేదని యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆదాయం తగ్గిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
సరదా కోసమే ప్రయాణిస్తున్నారు..
గతంలో ప్రజలకు ప్రధాన వాహనంగా జట్కా బండి ఉండేది. అయితే ప్రస్తుతం వాహనాలు రావడంతో సరదా కోసం మాత్రమే కొంతమంది టాంగాలపై ప్రయాణిస్తున్నారు. పొద్దస్తమానం బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద కాపు కాసినా కొందరు మాత్రమే గుర్రపు బండ్లు ఎక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. పదేండ్లుగా గుర్రపు బండి నడుపుతున్నా.
ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి ప్రస్తుతం రూ.పది తీసుకుంటున్నా. ప్రయాణికులు తక్కువగా కావడంతో ఆదాయం కోసం మార్కెట్లో కూరగాయలు, ఉల్లిగడ్డలు జట్కా బండిపై తీసుకెళ్తున్నాను.
ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి..
బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా గతంలో ప్రజలు జట్కాబండిని ఆశ్రయించేవారు. ప్రస్తుతం కొంత మంది మాత్రమే టాంగా ఎక్కుతున్నారు. గిరాకీ లేనప్పుడు గ్రామాలకు సరుకులు చేరవేస్తాను. 25 ఏండ్లుగా జట్కా బండిని నడుపుతున్నా. వేరే పని చేయలేక వృత్తిని మానుకోలేక కాలం వెల్లదీస్తున్నాం. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి.