శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో కనువిందు చేసిన చిన్నారులు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
పలు చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమం
ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు
ఊట్కూర్, ఆగస్టు 31 : శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మంగళవారం మండలకేంద్రంలో ప్రజలు కనుల పండువగా నిర్వహించారు. పలువురు చిన్నారులు గోపి, గోపికల వేషధారణలతో చూపరులను అలరించారు. శ్రీకృష్ణా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల గుండా గోపి, గోపికల వేషధారణతో ముస్తాబైన చిన్నారులను ఊరేగించారు. చిన్నారుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయోధ్యనగర్‌లో ఏర్పా టు చేసిన పాల ఉట్ల పోటీలో వివిధ వార్డుల నుంచి యువకుల జట్లు ఆసక్తిగా పాల్గొన్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ సాయిమనోహర్, మక్తల్ సీఐ శంకర్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ స ర్పంచ్ భాస్కర్, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
నారాయణపేట, ఆగస్టు 31 : పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు కృష్ణుడు, గోపికల వేషధారణ వేసి మురిసిపోయారు. పట్టణంలోని పలు వార్డుల్లోని ప్రధాన కూడళ్ల లో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కృష్ణుడు, గోపిక ల వేషధారణలు వేసి ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించా రు. అంతకుముందు భరతమాత, సరస్వతీమాత చిత్రపటాలకు పూజలు చేశారు. ఆచార్యులు, మాతాజీలు ఉన్నారు.
శ్రీకృష్ణ ఆలయలంలో…
ధన్వాడ, ఆగస్టు 31 : మండలంతోపాటుగా వివిధ గ్రా మాల్లో శ్రీకృష్ణ జన్మష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మందిపల్లితండాలో శ్రీకృష్ణ ఆలయంలో భక్తు లు పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మిత్రమండలి ఆధ్వర్యంలో…
నారాయణపేట న్యూ టౌన్, ఆగస్టు 31 : జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ బజార్లో మిత్రమండలి కన్వీనర్ హరినారాయణ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై సైదులు శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుం డా చూడాలని కోరారు. అనంతరం ఎస్సై సైదులును సన్మానించారు. కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు తదితరు లు పాల్గొన్నారు.
కనుల పండువగా వేడుకలు..
నారాయణపేట టౌన్, ఆగస్టు 31 : పట్టణంలోని చౌక్ బజార్ మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. కళాకారులు, యువకులు భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ, కోలాట ప్రదర్శనలు నిర్వహించగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ చేతన హాజరై చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.