మక్తల్ నియోజకవర్గంలో100 చెరువులు, 60 కుంటలకు మరమ్మతులు
154 గొలుసుకట్టు చెరువులకు జలకళ
సాగులోకి 50వేల ఎకరాలకు పైగా బీడు మూములు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
మక్తల్ రూరల్, ఆగస్టు 31 : ఎప్పుడో కాకతీయుల కా లంలో నిర్మించిన చెరువులు, కుంటలను గత ప్రభుత్వాల వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడంతో అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నేపథ్యంలో ప్ర త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ చెరువులు, కుంటలకు పూర్వ వైభవం పట్టుకుంది. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల హయాంలో ఏర్పాటు చేసిన చెరువులు, కుంటలను మరమ్మతులు చేపట్టి గ్రామాల్లో రైతుల కు సాగునీటి ఇబ్బందులను తీర్చాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ య పథకం వల్ల చెరువులకు మహర్దశ పట్టుకుంది. అధ్వానంగా ఉన్న చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోవడంతో ఆయా గ్రామాల్లో గొలుసు కట్టు కింద ఎన్నో ఏం డ్లుగా బీడు భూములు సాగులోకి వచ్చాయి. అయితే గ్రా మాల్లో ఉన్న గొలుసు కట్టు చెరువులను సాగునీటి ప్రాజెక్టులకు అనుసంధానం చేయడంతో చెరువులు, కుంటలకు జ లకళ సంతరించుకున్నది. పూర్వం నుంచి వర్షాధారంపై ఆధారపడిన చెరువులు ఇప్పుడు కాల్వల ద్వారా నీటిని మళ్లించి నింపడంతో రైతులకు సాగునీటి సమస్య తీరడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. పంట కాల్వలకు నీరందడంతో బీడు భూములు అన్నీ సాగులోకి వచ్చి పచ్చని పంట పొ లాలు, చెరువు గట్లపై నీటి అలల సెల ఏరులు కనువిందు చేస్తున్నాయి. ఇంతకాలం వ్యవసాయాన్ని నమ్ముకొని వేల పెట్టుబడులు పెట్టి వేసిన పంట చేతికి అందకపోవడంతో ఇక వ్యవసాయం “దండగ” మారి అని విసిగివేసారిన రైతన్నల కండ్లలో మళ్లీ ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. మక్తల్ నియోజకవర్గంలో దాదాపు 100 చెరువులు, 60 కుంటలను మిషన్ కాకతీయ పథకం ద్వారా మరమ్మతులు చేశారు.
కోట్ల వెచ్చించి ఖర్చు పెట్టి చెరువులు, కుంటలను ప్రభు త్వం అభివృద్ధి చేశారు. గతంలో ఏ గ్రామంలో అయినా అ కాల వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోతే ఏండ్ల తరబ డి మరమ్మతులకు నోచుకునేది కాదు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతు లు జరిగాయి. నియోజకవర్గంలోని మక్తల్, ఉట్కూర్, న ర్వ, మాగనూర్, ఆత్మకూర్ మండలాల్లో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టారు. ఒక్కో గ్రామం లో నోటిఫైడ్ చెరువులతోపాటు చిన్న, చిన్న కుంటలను సై తం మిషన్ కాకతీయ పథకంలో చేర్చారు. దీంతో ప్రతి గ్రా మంలో 4-5 కుంటలు, చెరువులను పూడికతీయడం, కం ప చెట్ల తొలగింపు, గండ్లు పూడ్చడం, కట్టలను ఎత్తు పెంచ డం, పాటు కాల్వలు తదితర వాటిని మరమ్మతులు పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో చెరువుల రూపురేఖలు మారిపోయా యి. దీంతో వానకాలంలో వర్షాలు పడితే చాలు చెరువులకు నీరు చేరి నిండుతున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో దాదాపు అన్నీ చెరువులు నిండి అలుగుపారాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం
నియోజకవర్గంలో ఆయా గ్రామా ల్లో చెరువుల కింద గణనీయంగా సా గు విస్తీర్ణం పెరిగింది. ఇదివరకు చెరువులు ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో వేల ఎకరాల భూములు బీడు పడిపోయాయి. దీం తో రైతులు ఏమి చేయాల్లో పాలుపోని స్థితిలో కొందరు రైతులు వలస బాట పట్టారు. పట్నం వెళ్లి ఉపాధి పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్న తరుణంలో గ్రామాల్లో చెరు వులు, కుంటలు మరమ్మతులకు నోచుకొని జలకళతో కళకళలాడుతుండడంతో మళ్లీ రైతులు సొంత గ్రామాలకు వ చ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. దీంతో గ్రామా ల్లో చెరువుల కింద బీడు భూములు సాగు కావండతో ఉన్న ఊళ్లల్లోనే కూలీలకు పనులు లభిస్తున్నాయి. ప్రసుత్తం ని యోజకవర్గంలో దాదాపు 50 వేల ఎకరాలకు పైగా చెరువు ల కింద బీడు భూములు సాగులోకి వచ్చాయి. గ్రామాల్లో ఉన్న చెరువులను భీమా ఎత్తిపోతల పథకం కింద కాల్వల ను అనుసంధానం చేయడంతో ప్రతి చెరువుల కింద రైతు లు పంటలను పండించుకుంటున్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు
నియోజకవర్గంలో మొత్తం 154 గొలుసు కట్టు చెరువులను అనుసంధానం చేశాం. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ, (చిట్టెం నర్సిరెడ్డి), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద గొలుసు కట్టు చెరువులను నీటితో నింపాం. ఆయా గ్రామాల్లో మిషన్ కాకతీయ పథకం ద్వారా మరమ్మతులు చేయించి చెరువులకు శాశ్వత ప్రాతిపదికన నీటితో నింపడానికి అనుగుణంగా గ్రావెటీ కెనాల్స్‌కు డిస్ట్రిబ్యూటర్ చానల్స్‌ను ఏర్పాటు చేశాం. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగుపారాయి. చెరువుల కింద వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చి పంటలు పండించుకోవడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే రెండేండ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.