
సత్తుపల్లి, జనవరి 20 : సత్తుపల్లి పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీని నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. ఆధునిక వసతులతో మార్కెట్ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపన చేయగా.. పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న ఆర్అండ్బీ క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కూల్చివేసింది. రెండు ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు.
96 దుకాణాల సముదాయం
రెండు ఎకరాల్లో రూ.4.50 కోట్లతో వెజ్ దుకాణాలు 60, నాన్‌వెజ్ 36 దుకాణాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత మార్కెట్ నిర్మించనున్నారు. ఇందుకోసం మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మార్కెట్ డిజైన్ సైతం రూపొందించారు. రెవెన్యూ ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఇప్పటికే మున్సిపాలిటీకి కేటాయించడంతో పనులు ఇప్పటికే ప్రారంభించాం.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
గతంలో చికెన్, కూరగాయల మార్కెట్లు వేంసూరు రోడ్లో ఉండేవి. వినియోగదారులు తమ వాహనాలు రోడ్లపై నిలిపి కొనుగోలు చేస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడేది. ప్ర స్తుతం ఆర్అండ్బీ క్వార్టర్ల స్థలంలో ఈ సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వినియోగదారులు ఒకే దగ్గర వస్తువుల కొనుగోలుకు మార్గం సుగమం కానున్నది.
సకల వసతులతో నిర్మాణం
సత్తుపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సమీకృత మార్కెట్ నిర్మాణ ఆవశ్యకతను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లా. దీనికి ఆయన స్పందించి రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. కూరగాయలు, నాన్‌వెజ్ (మాంసం), పండ్లు, పూల దుకాణాలు ఒకేచోట నిర్మించనున్నాం. ఆధునిక వసతులతో మార్కెట్ పనులు ప్రారంభించాం.
అన్ని ఒకేచోట లభించేలా
వినియోగదారులకు అన్నిరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, ఇతర వస్తువులు ఒకేచోట లభించేలా సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తున్నాం. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహాయ, సహకారాలతో మార్కెట్‌ను అధునాతన హంగులతో నిర్మిస్తున్నాం. పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
చకచకా పనులు ప్రారంభం
పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ని ధులు మంజూరు చేసిం ది. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించాం. నిర్మాణం పూర్తయితే వినియోగదారులకు అన్ని వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి.