కవాడిగూడ : భోలక్‌పూర్‌లో కలుషిత నీటి సమస్యను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు బుధవారం భోలక్‌పూర్ డివిజన్లోని రంగానగర్‌లో గత నాలుగు రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికుల పిర్యాదు మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి డీజీఎం చంద్రశేఖర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ వాసులను కలుషిత నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భోలక్‌పూర్ డివిజన్లో శిధిలమైన డ్రైనేజీ, మంచి నీటి పైప్లైన్లను తొలగించి నూతన పైప్‌లైన్ వేసేందుకు దాదాపు రూ. 20 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. ఈ విషయమై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, బింగి నవీన్‌కుమార్, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, ఉమాకాంత్, పబ్బ కృష్ణ, ఇమ్రాన్ బాగ్ధాది, ప్రవీణ్‌కుమార్, ఆరీపోద్దీన్, కళ్యాణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.