
పెద్దశంకరంపేట, జనవరి 20 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. గురువారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి పథకం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మం డల పరిధిలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన పెంటయ్యకు మంజూరైన రూ.23 వేలు, పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన బాయికాడి రాములుకు రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. వీరోజిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అంబమ్మకు మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, నాయకులు శంకరయ్య, అమర్నాథ్, అడివయ్య తదితరులు పాల్గొన్నారు.