Disabled development | దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత

సైదాబాద్ : సమాజంలో దివ్యాంగులు ఆర్ధికంగా ఎదగటానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి వారిని ప్రోత్సహిస్తుందని జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ యూసీడీ విభాగం ప్రాజెక్టు అధికారి రత్నమ్మ అన్నారు.
బుధవారం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మినగర్ కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా దివ్వాంగ గ్రూప్ సభ్యులకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదని, స్వయం కృషితో వైకల్యాన్ని అదిగమించాలన్నారు.
బ్యాంక్ ఇచ్చిన రుణాలతో మంచి వ్యాపారులను చేసుకుంటూ ఆర్ధికంగా వృద్ధిలోకి రావాలన్నారు. ప్రతిభవంతులైన దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి దివ్యాంగ గ్రూపులో ఐదుమంది సభ్యులు ఉంటారని, ప్రతి గ్రూప్‌కు రెండు లక్షల రూపాయల చొప్పన బ్యాంక్ రుణాలను మంజూరు చేసిందని, మంజూరైన నిధులకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు.
దివ్యాంగులు ఆర్ధికంగా అభివృద్ధి చెందటం కోసం క్షేత్రస్థాయిలో స్వయంసహాయక సంఘాలను ఏర్పాటుచేసి, వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సంతోష్‌నగర్ సర్కిల్ కమ్యూనిటీ ఆర్గనైజర్ యాదయ్య, వీఆర్పీ నర్సింహ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

