
నేరేడుచర్ల, జనవరి 12 : సంక్రాంతి పండుగకు ఇంటిల్లిపాది ఊరెళ్లేందుకు సిద్ధమవుతున్నారా.. జర జాగ్రత్తలు తీసుకోండి. ఊరెళ్లే హడావిడిలో ఇంటి భద్రత, విలువైన వస్తువుల గురించి మరిచిపోకండి. ఈ సమయంలో తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
పండుగ ప్రయాణం విషాదం కావద్దు
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
సూర్యాపేట రూరల్, జనవరి 12 : పండుగ ప్రయాణం విషాదం కావద్దని, పండుగలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. సూర్యాపేట మండలంలోని 65వ జాతీయ రహదారిపై జనగాం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రాఫిక్ సమస్య రాకుండా జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. జిల్లాలోని అన్ని మార్గాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలని అన్నారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశామని, వాహనదారులు రోడ్డు సూచికలు పాటించాలని, క్రాసింగ్‌ల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.