
వలిగొండ, జనవరి14: మండలంలోని వెంకటాపురం పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండపై గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఈఓ మోహన్‌బాబు స్వామివారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిచారు. మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, బద్దం పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ సామ రాంరెడ్డి, వెంకటాపురం సర్పంచ్ కొత్త నర్సింహ పాల్గొన్నారు.
బీబీనగర్ : మండల కేంద్రంలోని వేణు గోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ నూలి విజయమనోహర్రావు ఆధ్వర్యంలో గోదారంగనాథస్వామి కల్యాణం నిర్వహించారు. జడ్పీటీసీ గోలి ప్రణీతా పింగల్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్, బొర్ర లింగారెడ్డి, కాసుల సత్యనారాయణ, అర్చకులు ఆంజనేయులు శర్మ, వేణు పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం గోదాదేవి సమేత రంగనాథ స్వామి కల్యాణ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్, సిరిపురం సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. వేడుకల్లో జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ, బడుగు రమేశ్, ఆలయ చైర్మన్లు లవణం ఉపేందర్, రాపోలు స్వామి, అర్చకులు రవిచార్యులు, యతిరాజస్వామి, జెల్ల వెంకటేశం, అప్పం రామేశ్వరం, తిరుమలేశ్ పాల్గొన్నారు.