హఫీజ్పేట్: జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అదనపుకమీషనర్ బాదావత్ సంతోష్నాయక్ హఫీజ్పేట్ డివిజన్ ఓల్డ్హఫీజ్పేట్లో గురువారం పర్యటించారు. డెంగీకేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎంటమాలజీ విభాగం చేపడుతున్న ప్రత్యేక చర్యలను పరిశీలించారు. అనంతరం విధులకు సిబ్బంది ఎంతమంది హజరవుతున్నారనే విషయంపై హజరుపట్టికను క్షుణ్ణంగా పరిశీలించారు. దోమలనివారణకు సిబ్బంది తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అనే విషయాలపై ప్రజలను ఆరాతీశారు.
డెంగీకేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించకుండా నిరంతరం అప్రమత్తంగాఉండి దోమలనివారణ చర్యలను క్రమతప్పకుండా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ మల్లయ్య, గణేష్ ఎంటమాలజీ ఏఈ, సూపర్వైజర్ రాజేష్ తదితరులు పాల్గోన్నారు.