వడ్లు కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకునే వరకు తగ్గేదే లేదంటూ టీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్పింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు కేంద్ర వైఖరిపై రైతులతో కలిసి నిరసన గళమెత్తింది. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాయి. ఆయా ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయాలు, రహదారులపై కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్టీ నాయకులు, రైతులు ప్లకార్డులుప్రదర్శించి నినాదాలు చేశారు. మండల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో మంత్రి నిరంజన్‌రెడ్డి, హన్వాడ, మహబూబ్నగర్లోమంత్రి శ్రీనివాస్‌గౌడ్ దీక్షలో పాల్గొన్నారు. ఆయా మండలాల్లో ఎమ్మెల్యేలు నాయకత్వం వహించారు.
ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రంతో కొట్లాడుతామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.. రైతుల ఉసురు పోసుకోవద్దని సూచించారు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి.. మండలకేంద్రాల్లో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు ధర్నాలో పాల్గొన్నారు..
రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని బొందపెట్టాలి : ఎమ్మెల్యే చిట్టెం
ఊట్కూర్, ఏప్రిల్ 4 : రైతు శ్రేయస్సు కోసం ఎంతకైనా తెగిస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం తాసిల్దార్ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలా న్యాయం చే స్తుంటే.. కేంద్రం వారి పొట్టకొట్టాలని చూస్తుందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఎలా ఉద్యమం చేశా మో.. అలాగే ఇప్పుడు ధాన్యం కొనుగోలు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని బొందపెట్టాలన్నారు. డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చే సే వరకు ప్రతి ఇంటిపై రైతులు నల్ల జెండాలతో ని రసన తెలపాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు చేయాలని తాసిల్దార్ తిరుపతయ్యకు వినతిఅందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, విండో మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు వెంకటేశ్‌గౌడ్, తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 4 : ధాన్యాన్ని కొనుగోలు చే యకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ పి లుపు మేరకు సోమవారం కల్వకుర్తి తాసిల్దార్ కా ర్యాలయం ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కేంద్రం అవలంబిస్తున్న విధానాన్ని ఎండగడుతామన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. అంతకు ముం దు టీఆర్ఎస్ శ్రేణులు పాలమూరు చౌరస్తాలో ధ ర్నా చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ మ నోహర, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, నాయకులు బాలయ్య, మధు, బచ్చయ్య, జంగ య్య, సూర్యప్రకాశ్‌రావు, రుక్నోద్దీన్, లింగం, రైతు లు, నాయకులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఏప్రిల్ 4 : ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభు త్వం మెడలు వంచుదామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని నంచ ర్ల గేట్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. కేంద్ర వై ఖరి మారే వరకు నిరసన చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు సలీం, రైతుబంధు సమితి ఉమ్మడి మండలాధ్యక్షు డు గిరిధర్‌రెడ్డి, గోపాల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షు లు పెంట్యానాయక్, భిక్షపతి, పీఏసీసీఎస్ వైస్ చైర్మ న్ లక్ష్మీనారాయణ, సర్పంచులు వెంకట్రాంరెడ్డి, రాఘవేందర్, కిరణ్ కుమార్‌రెడ్డి, నీల్యానాయక్, హన్మంతు, డైరెక్టర్ వెంకటయ్య, ఎంపీటీసీ చెన్న య్య, నాయకులు వెంకట్రాములు, గోపాల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, నర్సప్ప, ప్రభాకర్‌రెడ్డి, సాయిలు, బాలవర్ధన్‌రెడ్డి, కిష్టయ్య, వెంకట్‌రెడ్డి, ఖాదర్, దశరథ్, సత్యయ్య, రమేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు
తెలకపల్లి, ఏప్రిల్ 4 : రైతులపై వివక్షత చూపకుండా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని ఎ మ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం విషయంలో కేం ద్రం కుంటిసాకులు చూపిస్తుందన్నారు. చెమటో డ్చి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతురావు, ఎంపీపీ మధు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రె డ్డి, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచులు మల్లారెడ్డి, విష్ణు, లక్ష్మయ్య, ఎంపీటీసీలు రమేశ్, విజయలక్ష్మి, లక్ష్మమ్మ, నాయకులు పర్వత్‌రెడ్డి, పర్వతాలు, బంగారయ్య, శ్రీనివాసులు, సుందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, మురళి, రా జేందర్‌రెడ్డి, బాలగౌడ్, రాము, శ్రీను ఉన్నారు.
వెల్దండ, ఏప్రిల్ 4 : ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు పోసుకోవద్దని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులను నాశనం చే సేందుకు కుట్రలు పన్నుతున్నాడన్నారు. కేంద్రం మెడలు వంచి న్యాయం చేస్తామని తెలిపారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ విజితారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, రై తుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్‌రావు, విండో చైర్మన్ సంజీవ్ కుమార్, డైరెక్టర్ నాగులు నాయక్, సర్పంచులు శ్రీనునాయక్, పత్యానాయక్, రామకృష్ణ, శంకర్‌నాయక్, నాయకులు యాదగిరి, జైపాల్‌నాయక్, గోపాల్‌నాయక్, రవిగౌడ్, అలీ, శ్రీను, భీమయ్య గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, గిరి, సతీశ్, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల ఆగ్రహానికి బలి కావొద్దని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు చేపట్టిన ధర్నాకు హాజరై మాట్లాడా రు. కేంద్రం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నదన్నా రు. అందుకే పంజాబ్‌లో రైతులు తగిన గుణపా ఠం చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు పంపించినా పట్టించుకోడం లేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో టీఆర్ఎస్ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు నారాయణరెడ్డి, మొగులయ్య, నాయకులు నాగయ్య, రాజవర్ధన్రె డ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట, ఏప్రిల్ 4 : రైతులు, కార్మికులు, ప్ర జలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను దేశం నుంచి తరిమికొట్టేవరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. సోమవారం అమ్రాబాద్ మండలకేంద్రంలో రైతులు, టీ ఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ, కాం గ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు నష్టం కలిగిస్తున్న కేం ద్రానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీకి వంత పాడుతున్న కాంగ్రెస్‌ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ చేతగానితనం వల్లే బీజేపీ చెలరేగిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ జా తీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ భయపడే వ్యక్తి కాదని, ధాన్యాన్ని కొనుగోలు చేయించేవరకు నిద్రపోరన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్‌రెడ్డి, చెన్నకేశవులు, శారద, శ్రీరాం, సుధాకర్‌రె డ్డి, రాజారాం, నిరంజన్, తిరుపతయ్య ఉన్నారు.
మల్దకల్, ఏప్రిల్ 4 : ధాన్యాన్ని కొనుగోలు చే యకపోతే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలకేంద్రంలోని రైతువేదిక ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రాష్ర్టాల్లో ధాన్యం కొనుగోలు చేసి తె లంగాణలో ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించా రు. బీజేపీ సర్కార్ రాష్ట్రంపై సవిత తల్లి ప్రేమ చూ పిందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని తాసిల్దార్ సరితకు టీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటన్న, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచులు వెంకటేశ్వర్‌రెడ్డి, యాకో బు, పురుషోత్తంరెడ్డి, శివరామిరెడ్డి, ఎంపీటీసీలు పెద్ద గోపాల్‌రెడ్డి, జయమ్మ, నాయకులు సీతారామిరెడ్డి, ప్రహ్లాదరావు, కృష్ణారెడ్డి, అజయ్, నరేందర్, జనార్దన్‌రెడ్డి, మహబూబ్అలీ, మధు, పరశురాము డు, గోవిందు, ప్రభాకర్, అమృత్, తిమ్మరాజు, రై తులు, నాయకులు పాల్గొన్నారు.
అయిజ, ఏప్రిల్ 4 : ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేంద్రంపై యుద్ధం చేసేందుకు వెనుకాడబోమని ఎమ్మెల్యే అబ్రహం హెచ్చరించారు. సోమవా రం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేం ద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘వరి సాగు చేయండి, వడ్లు కొనుగోలు చే యించే బాధ్యత తమదే’ అని చెప్పి నేడు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనాలని పార్లమెంట్లో, కేంద్ర మంత్రితో చర్చలు జరిపినా ఫలి తం లేకపోయిందన్నారు. అనంతరం తాసిల్దార్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, విండో చైర్మన్ మ ధుసూదన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వి ష్ణువర్ధన్రెడ్డి, విండో మాజీ చైర్మన్ రాముడు, సర్పంచులు తిప్పారెడ్డి, భద్రయ్య తదితరులు ఉన్నారు.