
సత్తుపల్లి, జనవరి 14: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కొత్తూరు పంచాయతీలోని రైతువేదికలో శుక్రవారం సింగరేణి భూనిర్వాసితులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కొత్తూరు, రేజర్లకు చెందిన భూనిర్వాసితులకు ఎకరానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ నిర్వాసితుల పక్షాన నిలబడి మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేశారన్నారు. కలెక్టర్ గౌతమ్‌తో పాటు రెవెన్యూ అధికారులూ సాయపడ్డారన్నారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా సీఎం స్పందించారన్నారు. 400 మంది రైతులకు సుమారు రూ.86 కోట్ల మేర పరిహారం అందిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మీనన్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గాదె సత్యం, రేజర్ల సొసైటీ ఛైర్మన్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భీమిరెడ్డి గోపాల్‌రెడ్డి, గొర్ల వెంకటరెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వరరావు, నర్సింహారావు, నరేందర్‌రెడ్డి, జగ్గారెడ్డి పాల్గొన్నారు.