
రాష్ట్ర సర్కారు రైతుల పక్షాన నిలుస్తూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు వంటి పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర సర్కారు మాత్రం వివక్ష చూపుతున్నది. వానకాలం సీజన్‌కు ముందే ఎరువుల ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం.. మరోమారు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నది. యూరియా ధరలు తమ పరిధిలో ఉంచుకొని, మిగతా వాటి రేటు నిర్ణయాన్ని ప్రైవేట్ కంపెనీలకు వదిలేసింది. ముడిసరుకుల పేరిట కంపెనీలు అడ్డగోలు ధరలు పెంచే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవు తుండగా.. 3.80 లక్షల టన్నుల ఎరువులు వినియోగం అవుతాయి. రైతన్నలపై దాదాపు రూ.50 కోట్ల భారం పడనుంది. పెంచిన ధరలు తగ్గించాలని రైతులు, టీఆర్ఎస్ నాయకులు మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ఆదిలాబాద్, జనవరి 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాల సరుకుల ధరల పెంపుతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు సై తం పెరగనుండడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం కేవలం యూరియా ధరల నియంత్రణను తన వద్ద ఉంచుకొని మిగతా ఎరువుల ధరల నిర్ణయా న్ని తయారీ కంపెనీలకు వదిలేసింది. ముడిసరుకుల ధరల పేరిట కంపెనీలు ఎరువుల ధరలను పెంచుతున్నాయి. వానకాలం సీజన్ ముందుగానే ఎరువుల ధరలు పెరిగాయి. యా సంగి ప్రారంభమైన వెంటనే కంపెనీలు మరోసారి మందుబస్తాల ధరలు పెంచాయి. మొక్క లు బాగా పెరగడానికి, అధిక దిగుబడు లు సాధించడానికి రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. వీటి ధరలు బాగా పెరగడంతో పంట పెట్టుబడులు సైతం పెరిగాయి.
కాంప్లెక్స్ ఎరువుల భారం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారు. ఇందుకోసం 3.80 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తారు. యారియా 1,50,250 టన్ను లు, డీఏపీ 66,350, ఎంవోపీ 42,800, కాంప్లెక్స్ 98,800, ఇతర ఎరువులు 22, 500 టన్నులను వినియోగిస్తారు. ప్రస్తుతం యూరియా, డీఏపీ ఎరువుల ధరలను పెంచగపోగా మిగితా వాటి ధరలు బాగా పెంచారు. ప్రస్తుతం రూ. 1300 ఉన్న 20:20:0:13 బస్తా ధరను రూ.1375కు, రూ.1725 ఉన్న 28:20:0 బస్తా ధరను రూ.1900, రూ. 11 50 ఉన్న 15:15:15:09 ధరను రూ.14 50, పొటాష్ బస్తాను రూ. 1040 నుంచి రూ. 1700కు, రూ.1700 ఉన్న 14:35:14 సంచి ని రూ.2 వేలకు, ప్రస్తుతం రూ.1550 ఉన్న 24:24:0:18 ధరను రూ.1900కు పెంచారు. పెరిగిన ఎరువుల ధరల కారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.50 కోట్ల భారం పడనున్నది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు నష్టమే..
భీంపూర్ : ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ల విష యంలో రైతులకు న ష్టంజేసే పనులు చేస్తు న్నది. ఇప్పుడు మళ్లీ ఎ రువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నది. మా కుటుంబానికి అర్లి (టీ) శివారులో 20 ఎకరాల భూమి ఉన్న ది. రెండు పం టలకు కలిపి ఎంతలేదన్నా రూ. 2 లక్షల ఎరువులు కొనుగోలు చేస్తాం. ఇ డు ఈ ధరల పెంపుతో రూ.30 వేల అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుబంధు, బీమా , ఉచిత కరెంట్ ఇస్తూ రైతు లకు అండగా నిలుస్తున్నారు. కానీ కేంద్ర ప్ర భుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఇప్పటికైనా ధరలు తగ్గించాలే. లేకుం టే మళ్లీ ఆందోళనలు ప్రారంభమవు తాయి.
రైతుల మీద పగ పట్టినట్లే ఉన్నది..
భీంపూర్ : కేంద్ర ప్రభుత్వం రైతుల మీద పగబట్టినట్లే అనిపిస్తున్నది. ఇంత కు ముం దు ధాన్యం కొనుగోళ్లలో తిరకాసు పెట్టి రైతులను ఆగమాగం చేసింది. ఇప్పుడు మళ్లీ ఎరువుల ధరలు పెంచి నడ్డి విరుస్తున్నది. మా కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉన్నది. మేము రెండు పంటలకు కలిపి రూ.1.50 లక్షల ఎరువులు కొనుగోలు చేస్తాం. ఇప్పుడు పెరిగిన ధరలతో అదనంగా మరింత పెట్టుబడి ఎక్కువవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచనజేసి నిర్ణ యాన్ని వెను కకు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ రైతులంతా ధర్నా బాట పడుతారు.
కుంటాల : కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల బతుకులు మరింత చితికిపోనున్నాయి. సాగు పెట్టుబడులు అధికమై అన్నదాతలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో పొటాష్ రూ. 1050 కి లభించగా రూ. 50 కిలోల బస్తాపై రూ. 700లు పెంచడం రైతుల నడ్డి విరవడమే 2020 కాంప్లెక్స్ ఎరువు ధరలను ఈ ఏడాదిలోనే రెండుసార్లు పెంచారు. కేంద్రం రైతులపై కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతూ ఆర్థిక భారాన్ని మోపుతున్నది.
-(జాదవ్ అప్పారావు, రైతు, అంబకంటి, కుంటాల)
నష్టాల పాలవుతాం ..
కుంటాల : కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రైతులు మరింత కష్టాల పాలవుతారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. ఆధునిక సాగుకోసం యంత్రాలను ఉపయోగించేందుకు ట్రాక్టర్లు, ఇతర యంత్రాలకు ధరలు పెరిగాయి. సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించి ఇక్కడ ఆదుకుంటుండగా కేంద్రం కాంప్లెక్స్ ధరలు పెంచుతూ రైతులను అప్పుల ఉబిలోకి నెట్టి ఆగం చేస్తున్నది. ధరల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి.
-(జక్కుల ముత్యం, రైతు, కుంటాల)