సుల్తాన్‌బజార్ : రోడ్డుపై ప్రయాణించే సాధారణ వాహనదారులకు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం సాధారణంగా చూస్తుంటాం. కాని దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని ప్రధాన బస్టాండ్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు.
ఇందులో భాగంగా ఎంజీబీఎస్ లోని అన్ని ఫ్లాట్ ఫారంలపై డ్రైవర్లు,కండక్టర్లకు తనిఖీలను చేపట్టారు. నిత్యం వందలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లు, కండక్టర్లు మద్యం సేవించవద్దనే అవగాహన కల్పించేందుకు ఇటువంటి తనిఖీలు దోహదం చేస్తాయని ఎండీ సజ్జనార్ ఆలోచనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం.ఇటువంటి తనిఖీలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు దోహదం చేస్తుందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటు న్నాయి.