కవాడిగూడ : భోలక్‌పూర్‌లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని ముషీరా బాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్లోని రంగానగర్ మొదటి వెంచర్లో శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన నూతన పైప్‌లైన్‌ను జలమండలి డీజీఎం చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్‌పూర్ డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. రంగానగర్ మొదటి వెంచర్లో తాగునీటి పైప్‌లైన్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో నూతన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దికి పెద్దపీట వేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్దికి కృషిచేసస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యుజవన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, మున్వర్ చాంద్, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.