అత్తాపూర్ : మూసీనది బఫర్జోన్లో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్లోని సర్వేనెంబర్ 35లో మూసీ బఫర్జోన్లో వెలిసిన నిర్మాణాలను కూల్చివేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
అత్తాపూర్ డివిజన్లోని మూసీ బఫర్జోన్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిర్మణాలను పరీశీలించి బఫర్జోన్లో ఉన్నందున కూల్చివేసినట్ల ఆయన తెలిపారు. నిన్మాణాలు చేపట్టే వారు బఫర్, ఎఫ్టిఎల్ పరిధిని చూసుకొని నిభందనల ప్రకారం కట్టుకోవాలని తెలిపారు.
మూసీ నది బఫర్, ఎఫ్టిఎల్ భూములపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎట్టి పరిస్థితులలో నిర్మణాలు చేపడితే చర్యలు తీసుకుంటమన్నారు. పట్టాలు ఉన్నప్పటికీ బఫర్, ఎఫ్టిఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వం విధించిన నిభందనలు అందరూ పాటించాలని నిబంధనలను అతిక్రమిస్తే కూల్చివేతలే కాకుండా కేసులు నమోదు చేస్తాం అని ఆయన హెచ్చరించారు.