కొండాపూర్: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. హఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్ కాలనీలో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతుండటంతో వాటిని కూల్చివేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసి అధికారులు ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా 4 బహుళ అంతస్తులను 14 కంప్రెషర్లతో పోలీస్ బందోబస్తు సహయంతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను మరిన్నింటిని గుర్తించినట్లు దశల వారిగా కూల్చివేతలు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి ఏసీపిలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.