
కూసుమంచి, జనవరి 20: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజా ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లి ఎమ్మెల్సీ తాతా మధుకు అభినందనలు తెలిపారు. పాలేరు నాయకులు, ప్రజాప్రతినిధులు మధును కలిశారు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాస్, కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, మరకంటి రేణుబాబు, వజ్జా శ్రీనివాస్‌రావు, కోటా సైదిరెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తాతా మధును పాలేరు నియోజవర్గ నాయకులు సత్కరించారు.
కూసుమంచి రూరల్, జనవరి 20: ఎమ్మెల్సీ తాతా మధును ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సహా పలువురు మండల నాయకులు అభినందించారు. ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు బదావత్ లక్ష్మణ్‌నాయక్ తదితరులు ఉన్నారు.
తిరుమలాయపాలెం, జనవరి 20: ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణస్వీకారోత్సవానికి పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తాతా మధుకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ బోడ మంగీలాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న,పులుగుజ్జు వెంకటేశ్వర్లు, బోడ మంచానాయక్, చామకూరి రాజు, పరికపల్లి చంద్రశేఖర్, రేపాకుల రవి, తాత రవీందర్, షేక్ షకీల్ పాషా, చందు పాల్గొన్నారు.