Vaccination | పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడలో యూపీహెచ్సీ కేంద్రాలలో కరోనాను నియంత్రించేం దుకు 15 నుండి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్, బూస్టర్ వ్యాక్సిన్ను ఆయన వైద్యాధికారులు డాక్టర్ కృష్ణమోహన్ రావు, డాక్టర్ రాజ్యలక్ష్మీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడూతూ కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపద్యంలో 15 నుండి 18 ఏండ్లలోపు పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ను వేయించుకోవాలన్నారు. తీవ్రమైన జలుబు, తలప్పి, జ్వరం ఉన్నట్లెతే వెంటనే సంబంధిత యూపీహెచ్సీలలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని అన్నారు.
సంబంధిత యూపీహెచ్సీల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని, ఇలాంటి ఒమిక్రాన్లు ఎన్ని వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని అన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

