ఎదులాపురం, ఏప్రిల్ 8 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న సీసీఐని కేంద్ర ప్రభుత్వం తెరిపించాలని కోరుతూ చేపట్టిన దీక్షను సాధన సమితి సభ్యులు విరమించారు. 45 రోజులుగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దీక్ష శిబి రం వద్దకు ఎమ్మెల్యే జోగు రామన్న చేరుకున్నా రు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసమిచ్చి వి రమించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం సీసీఐ పునర్నిర్మాణం కోసం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదన్నా రు. ఫ్యాక్టరీ నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం గా ఉందని పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సభాముఖంగా తెలిపార ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభు త్వం ఉన్న పరిశ్రమలను మూసేసి ఉద్యోగులను రోడ్డు పై వదిలేస్తున్నదని గుర్తుచేశారు. స్థానిక ఎంపీ గత ఎన్నికల్లో ‘కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది.. సీసీఐని త్వరలోనే తెరిపిస్తాం’ అని ఇచ్చిన హామీ సంగతి ఏంటని ప్రశ్నించారు. దీక్షలో 1016 మంది కూ ర్చున్నారని, వీరికి 2027 మంది మద్దతు తెలిపా రన్నారు. స్వచ్ఛందంగా రిలే నిరాహారదీక్షలు చేపడుతుంటే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం డబ్బులిచ్చి చేపడుతున్నారని అనడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ తల్లి ఆశమ్మ మృతిచెందగా.. రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అత్మచైర్మన్ జిట్ట రమేశ్, టీఆర్ఎస్ బీసీ సెల్ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, సీసీ ఐ సాధన కమిటీ కో కన్వీనర్లు నారాయణ, కొండ రమేశ్, నాయకులు ఇమ్రాన్, మమత, ప్రభావ తి, అనసూయ, జుబేదా, ఉమ పాల్గొన్నారు.