బీబీ కా ఆలం సందర్భంగా నాలుగు అంచల భద్రత

చాదర్ఘాట్ : బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్ధన కేంద్రంలో ఆలం లను నిమజ్జనం చేయడంతో ఊరేగింపు ముగియనుంది. ఈ నేపథ్యంలో చాదర్ఘాట్లోని నిమజ్జన ప్రార్ధన స్థలం వద్ద నాలుగుఅంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు అధికారులు. ముందుగా ప్రదాన రోడ్డు పై రోప్ పార్టీ, ఆ తరువాత బారీకేడింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. కొంత దూరంలో ప్రధాన కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్, ప్రవేశ మార్గం వద్ద అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డబీర్పురా లోని అసుర్ఖానా నుంచి ఆలం ల ఊరేగింపు ప్రారంభమై పాతబస్తీలోని వివిధ ప్రాంతాల మీదుగా రాత్రి దాదాపు ఏడు గంటల సమయంలో చాదర్ఘాట్ నిమజ్జన కేంద్రానికి చేరుకుంటుంది.

250 మంది సిబ్బందితో బందోబస్తు… అవగాహన కల్పించిన ఉన్నతాధికారులు
బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా చాదర్ఘాట్లోని నిమజ్జన కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీరికితోడు టాస్క్ఫోర్స్ పోలీసులు, అదనపు బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కాగా, పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు బందోబస్తు పై అవగాహన కల్పించారు. బందోబస్తులో భాగంగా చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఈస్ట్ జోన్ డీసీపీ, జాయింట్ కమీషనర్ రమేశ్, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేంధర్, చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ లు బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

