ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 15: గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. జిల్లాల్లోని పలు చర్చిల్లో ఫాదర్ల ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. శుక్రవారం తెలంగాణ చౌక్‌లోని చర్చి నుంచి ఏసుక్రీస్తు సిలువతో శోభాయాత్ర నిర్వహించారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్‌ఫ్రైడే ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ పిల్లలు నాటికలు ప్రదర్శించారు.