పేదల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. జిల్లా లో పలుచోట్ల ఆయన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతిబాఫూలే విగ్రహా లు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. జ్యోతి బాపూలే సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేశారని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వక్తలు సూచించారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి బాఫూలే చిత్రపటానికి పలువురు పూలమాలల వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడు తూ ఆ మహనీయుని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. కౌన్సిలర్ పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి, బిట్లింగ్ నవీన్, నరేందర్, నాయకులు గండ్రత్ రమణ, అడ్ప పోశెట్టి, ఆకుల రామకృష్ణ, రాజు, శ్రీధర్, తదితరులున్నారు.
భైంసా, ఏప్రిల్ 11 : పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే జయంతిని సోమవారం టీఎన్జీ వో ఆధ్వర్యంలో, బుద్ధిస్టు సొసైటీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. టీఎన్జీవో కార్యదర్శి శ్రీహరి, ఆకాశ్, టీఎన్జీవో సభ్యులు, బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు ప్రసన్నజిత్ ఎంబ్లే, జనసేన పార్టీ నాయ కులు మహేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, ఏప్రిల్ 11 : పట్టణంలోని విశ్రాంతి భవనంలో జ్యోతిబాఫూలే చిత్రపటానికి టీజీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కొక్కుల ప్రదీప్, రామిడి మహేశ్, రాజన్న, అశోక్, రాకేశ్, సుబ్బు పాల్గొన్నారు.
ముథోల్, ఏప్రిల్ 11 : మండల కేంద్రంలో జ్యోతిబాఫూలే విగ్రహానికి పలువురు పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువకులు జ్యోతిబా ఫూలే అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ముథోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీటీసీ సభ్యులు దేవోజీ భూమేశ్, సరళా శ్రీని వాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాలీద్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మెత్రి సాయినాథ్, నాయకులు వాగ్మారే నారాయణ, గంగాధర్ చందనే, కేర్బాజీ, విశ్వంబర్, గణేశ్ శిర్షే, వందేమాతరం, గంగాధర్, విఠల్ కాంబ్లీ, గౌతమ్, వినోద్ రాజ్, రాహుల్, అవి నాశ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తానూర్, ఏప్రిల్, 11 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో జ్యోతిబాఫూలే చిత్రప టానికి తహసీల్దార్ పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ మహనీయులు చూపిన బాట లో నడవాలన్నారు. ఆర్ఐ గంగాధర్, మాజీ స ర్పంచ్ జాదవ్ మాధవరావ్ పటేల్ పాల్గొన్నారు.
దస్తురాబాద్, ఏప్రిల్ 11 : తహసీల్ కార్యాల యం, గొడిసెర్యాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తహసీల్దార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు జ్యోతి బాఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివ కుమార్ మాట్లాడుతూ ఆడపిల్ల చదువు అవ నికే వెలుగు అని అమలు చేసి జ్యోతిబాఫూలే నిరూపించారని పేర్కొన్నారు. ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య, ఏఈవో తిరుపతి, డిప్యూటీ సర్వే యర్ శ్రీనివాస్‌రావు, వీఆర్వోలు విశ్వనాథ్, ఏఎస్వో సంతోష్, జూనియర్ అసిస్టెంట్ సుల్తా నా, వెంకటేశ్, శివకృష్ణ, పాఠశాల చైర్మన్ రాజేంద ర్, ఉపాధ్యాయులు వెంకట్రాజం, రాధిక, రాజమణి, రాజేశ్వర్, రోహిణి, సత్యం, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, ఏప్రిల్ 11 : ధర్మోరాలో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి మా అమ్మనాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు పూలమాల వేసి నివాళుల ర్పించారు. క్షేమ తదితరులు పాల్గొన్నారు.