భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులపై రైతన్నలు, కూలీలు తిరగబడ్డారు. శనివారం మధ్యాహ్నం చెన్నూర్ శివారుల్లోని మిర్చి తోటల వద్దకు వెళ్లి చెన్నూర్ లిఫ్ట్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో ఆగ్రహించారు. మా ఎమ్మెల్యే సుమన్ మంచి పనులు చేస్తుంటే, అభివృద్ధిని ఓర్వలేక విషప్రచారం ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. మీరు మా కల్లాల వద్దకు రావద్దంటూ ఎదురుతిరిగారు. దాంతో చేసేదేమీ లేక కమలం పార్టీ నేతలు వెనుదిరిగి కొత్త డ్రామాకు తెరలేపారు. మాపై దాడికి దిగారంటూ టీఆర్ఎస్ నాయకులను, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నించారు. చిల్లర రాజకీయాలను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో శనివారం రాత్రి టీఆర్ఎస్ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : తమ కల్లాల్లోకి రావద్దని రైతులు, కూలీలు బీజేపీ నాయకులను వారించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ రైతుల్లో చిచ్చుపెట్టేందుకు బీజేపీ చేసిన కుట్రను వారు భగ్నం చేశారు. బీజేపీ నాయ కులను రైతుల వద్దకు పంపి, వారిని రెచ్చగొట్టేం దుకు యత్నించిన వివేక్ వర్గానికి షాక్ ఇచ్చారు. తమను పావులుగా వాడుకుంటూ లబ్ధిపొందుతు న్నారని మండిపడ్డారు.
చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా, ప్రజలు ఘాటుగా సమాధానం చెప్పారు. విష పూరిత రాజకీయాన్ని అడుగడుగునా అడ్డుకుంటు న్నారు. వివేక్ డైరెక్షన్లో చెన్నూర్ శివారులో మిర్చి తోటలకు వెళ్లిన బీజేపీ నాయకులపై రైతులు తిరగబడ్డారు. అయినా నేతలు అక్కడే ఉండడం తో రైతులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిస్థితిలో వారు వెనుదిరిగారు. ఇదిలా ఉండ గా.. దొంగను దొంగే అన్నట్లు టీఆర్ఎస్ నేతలే దాడి చేశారని బీజేపీ నాయకులు హైడ్రామాకు తెరలేపారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతలపై, ముఖ్యంగా వివేక్ తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలు పొందడంతో చెన్నూర్ నియోజకవర్గ రూపురేఖలు మారాయి. ముందెన్నడూ లేని విధంగా చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందడాన్ని వీకెండ్ లీడర్ వివేక్, ఆయనిచ్చే డబ్బులకు ఆశపడే పెయిడ్ బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపో తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్నాళ్లుగా అడుగడుగునా కుట్ర రాజకీయాలకు తెరలేపు తున్నారు.
చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెన్నూ ర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరైన తరువాత నుంచి మాజీ ఎంపీ వివేక్ తట్టుకోలేక పోతు న్నారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బద్నాం చేయాలని ప్రయత్నా లు చేస్తున్నారు. చెన్నూర్‌ను సస్యశ్యామలం చేసే భారీ ప్రాజెక్టును స్వాగతించాల్సిందిపోయి విమర్శలకు దిగుతున్నారు. ఇది కమీషన్ల ప్రాజెక్టు అని, దీంతో రైతులకు ఎలాంటి లాభం ఉండదని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టు శంకుస్థాపనకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యం లో రాజకీయంగా తనకు పుట్టగతులుండ వని భావిస్తున్న వివేక్ రైతులను రెచ్చగొట్టే కార్యక్ర మాలకు పూనుకుంటున్నారు.
గతంలో ఇక్కడి నుంచే గెలిచి అనేక పదవులు నిర్వహించి వేల కోట్ల ఆస్తులు సంపాదించిన వివేక్ కుటుంబం శాశ్వత అభివృద్ధి పని ఒక్కటి కూడా చేపట్టలేదు. నియోజకవర్గాన్ని తన తాబేదార్లకు వదిలేసి, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు కని పిం చేవారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలి చిన తరువాత వందల కోట్ల శాశ్వత అభివృద్ధి పనులు చేపడు తుండడం, అక్క డే నివాసం ఏ ర్పాటు చేసు కొ ని ప్రజల్లోనే ఉం టుండడంతో వివేక్ భరించ లే కపోతున్నారు. ఆయన చే స్తున్న కుట్ర రాజకీయా లను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నేతల్లారా ఇప్పటికైనా అభివృద్ధికి సహకరించాలని, కుతం త్రాలతో రెచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దంటూ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
దొంగే దొంగ అన్న చందంగా బీజేపీ నాయ కుల తీరు ఉందని చెన్నూర్ టీఆర్ఎస్ పార్టీ నా యకులు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయక త్వంలో నియోజకవర్గంలో 90 వేల ఎకరా లకు సాగునీరందించే చెన్నూర్ లిప్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.1,658 కోట్లు మంజూరు చేయిం చారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించాలని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు వరికల్లాల వద్దకు వెళ్లి గొడవ చేయాలనుకున్నారన్నారు. రైతులు నిలదీయడం తో గుండాల్లాగా దుర్భాష లాడుతూ దాడి చేశారని పేర్కొన్నారు. రైతులు ప్రతిఘటించడంతో ఈ అం శాన్ని టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారనే కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. బీజేపీ నాయకుల అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని, రైతులపై బీజేపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు. చెన్నూర్ ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయా లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో శనివారం రాత్రి టీఆర్ఎస్ నాయకులు కమలనాథుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీ ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మిర్చి రైతుల పరామర్శ పేరిట బీజేపీ చిల్లర రాజకీ యాలు చేస్తుండడాన్ని రైతులు తిప్పికొట్టార న్నారు. రైతులతో జరిగిన ఘర్షణను టీఆర్ఎస్ నాయకుల పైకి నెట్టి దుర్మార్గమైన రాజకీయం చేయాలని మండిపడ్డారు. ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారని విమ ర్శించా రు. టీఆర్ఎస్ నాయ కులు నడిపెల్లి విజిత్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, గాదె సత్యం, హరికృష్ణ, వాల శ్రీనివాసరావు, జగన్ మోహన్ రావు, కొండాల్‌రావు, గొంగళ్ల శంకర్, సోహైల్ ఖాన్, కార్కూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులపై మేము దాడి చేశామని కొత్త డ్రామాకు తెరలేపారు. మా ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్‌ను ప్రగతిపథంలో నడిపిస్తుంటే బీజేపీ నాయకులు తట్టుకోవడం లేదు. చేల వద్దకు వెళ్లి గొడవ చేయాలని చూశారు. రైతులు తిరగబడడంతో వెనుదిరిగారు. కమలనాథుల విషప్రచారాన్ని నమ్మవద్దు. – విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు
మంచిర్యాల పట్టణంలో శనివారం రాత్రి టీఆర్ఎస్ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలను మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారని విమర్శించారు.
– మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 30