ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 27: అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అశ్రఫ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. పట్టణంలోని టీఆర్ఎస్ భవన్లో పట్టణ ప్రధాన కార్యదర్శి పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, మమత, నారాయణ, యూనిస్ అక్బానీ, గంగారెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
బేల, ఏప్రిల్ 27 : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని జడ్పీటీసీ అక్షితపవార్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండల కేంద్రంతో పాటు చంద్పల్లి గ్రామంలో జడ్పీటీసీ అక్షిత పవార్, మణియార్పూర్లో ఎంపీపీ వనిత ఠాక్రే, గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రశేఖర్, దేవన్న, తేజ్రావ్, విఠల్, విశాల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణేశ్‌యాదవ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవన్న, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 27 : తాంసి, కప్పర్ల, పొన్నారి, జామిడి, బండలనాగాపూర్, వడ్డాడి, గిరిగాం, అంబుగాం, సవర్గాం, గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కృష్ణ, గజానన్, శంకర్, భరత్, శ్రీనివాస్, ఎంపీటీసీలు అశోక్, నరేశ్, రేఖారఘు, నాయకులు రమణ, దాసు, రమేశ్, మల్లయ్య, శ్రీనివాస్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ శోభాబాయి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, నాయకులు మారుతి, మహేశ్, సాయినాథ్, సుంకట్రావ్, నగేశ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తొడసం నాగోరావ్, మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్‌రావ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు తరలివెళ్లారు. సభలో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మావల జడ్పీటీసీ వనితారాజేశ్వర్, ఎంపీపీ చందాల ఈశ్వరీ, పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.