నిర్మల్ టౌన్, ఏప్రిల్ 24: నిర్మల్ ప్రాంతంలో జనశక్తి పార్టీ పేరిట డబ్బుల కోసం వ్యాపారులను బెదిరిస్తున్న రాజేంద్రప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మం డలం సనుగుల గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ 1997లో నిర్మల్‌కు వచ్చి గొల్లపేట్‌లో ఉంటున్నాడు. గతంలో రాజేంద్రప్రసాద్ బైక్ దొంగతనం కేసులో కరీంనగర్ జిల్లాలోని జైలుకు వెళ్లాడు.
అక్కడే ఉన్న జనశక్తి పార్టీకి చెందిన నర్సయ్య పరిచయం అయ్యాడు. వారిద్దరూ జనశక్తి పార్టీపై చర్చించుకున్నారు. జైలు నుంచి విడుదలైన రాజేంద్రప్రసాద్ ని ర్మల్కు వచ్చి శ్రీరాం చిట్‌ఫండ్ కంపెనీలో పనిచేస్తూ 2002లో దొంగతనానికి పాల్పడడంతో యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. తర్వాత బైక్ దొంగతనం, చీటింగ్ కేసు కింద 2005లో జైలుకు వెళ్లి విడుదలయ్యాడు. 2009 లో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన ఆయన ఓ కంపెనీ పెట్టి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో తిరిగి ఇం టికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని జనశక్తి నక్సలైట్‌గా అవతారమెత్తి జనశక్తి పార్టీ పేరుతో నిర్మల్ పరిసర ప్రాం తాల్లో వివిధ వ్యాపారులను బెదిరించి డబ్బు లు వసూలు చేసేందు కు ప్రయత్నించాడు.
ఇటీవల మంజులాపూర్‌లోని ఓ వ్యాపారికి ఫోన్ చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేయడంతో యజమాని ఫిర్యాదు మేరకు ఫోన్ నంబరు ఆధారంగా నిందితుడిని పట్టుకొని పలు సెక్షన్ల కింద కేసు లు నమోదు చేశారు. వ్యాపారులకు ఫోన్‌కా ల్స్ బెదిరింపులతో పాటు ప్రెస్‌నోట్, ఈ మె యిల్ బెదిరింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఆదివారం రిమాండ్‌కు తరలించామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ని ర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ని ర్మల్ గ్రామీణ ఎస్ఐ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.