రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు దేశరాజధాని ఢిల్లీలో నిరసన దీక్షకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివెళ్తున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హస్తినకు వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటల సాగు నిస్తీర్ణం బాగా పెరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గం టల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి పథకాలు రైతులకు ఎం తో ప్రయోజనంగా మారాయి. ఉమ్మడి జిల్లా లో వానకాలంలో 18 లక్షల ఎకరాల్లో యా సంగిలో 5 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పం టలు సాగు చేస్తున్నారు. రెండు సీజన్లలో పత్తి, వరి, జొన్న, కందులు, సోయాబీన్, మక్క, శనగ, నువ్వు, గోధుమ పంటలను రైతులు పండిస్తారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ మ ద్దతు ధర చెల్లిస్తున్నది.
నిబంధనల ప్రకారం వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇతర రాష్ర్టాల్లో రెండు పంటలను కొనుగోలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం కొనడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానకాలంలో పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేసింది. యాసంగిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.46 లక్ష ల ఎకరాల్లో వరిని సాగు చేయగా.. 2.88 లక్ష ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగి వడ్ల కొనుగోళ్లను కేంద్ర ప్ర భుత్వం నిరాకరించడంతో టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నది.
కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు విడుతలుగా చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయి. జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు బీజేపీ ప్రభుత్వానికి సెగ తగిలేలా ఆందోళనలు చేపట్టారు. రేపు ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్షలకు జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తరలివెళ్లనున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జ డ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మ న్లు ఢిల్లీలో జరిగే ధర్నాకు హాజరవుతారు.