పన్నెండేళ్ల ప్రాణహిత మహాపుష్కర పర్వం వైభవంగా ముగిసింది. ఈ పన్నెండు రోజుల్లో దాదాపు పది లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పులకించి పోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద గల ప్రాణహిత నదీతీరం భక్తజన సంద్రంతో కిటకిటలాడాయి. ఆదివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూడుచోట్ల రోజూ మాదిరిగానే ప్రాణహితకు హారతి ఇచ్చి పుష్కరాలను ముగించారు. ప్రణీతా.. నీలో స్నానం జన్మజన్మల పుణ్యఫలం.. వెళ్లొస్తాం.. పుష్కరకాలానికి మళ్లొస్తాం.. నీకు ధన్యోస్మి..అంటూ భక్తులు ఇంటిదారి పట్టారు..
కోటపల్లి, ఏప్రిల్ 24 : పన్నెండు రోజులపాటు సాగిన ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పదకొండు రోజుల్లో 6.30 లక్షల మంది భక్తులు రాగా.. చివరి రోజు లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండే భక్తులు ప్రాణహిత నదికి బయలుదేరగా జాతీయ రహదారి-63 వాహనాలతో నిండిపోయింది. ఉప లోకయుక్త జడ్జి నిరంజన్ రావ్, విద్యుత్ శాఖ జీఎం శ్రీకృష్ణశర్మ పుణ్యస్నానాలు ఆచరించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం వారు ఆదివారం సాయంత్రం ప్రాణహితకు వాయినం సమర్పణ, పుష్కర హారతి ఇవ్వడంతో పుష్కరాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ దంపతులు, ఏసీపీ నరేందర్ దంపతలుతులు, డీసీ శ్రీకాంత్, పుష్కరఘాట్ ఇన్చార్జి అనూష, ధర్మపురి ఈఓ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఎస్ఐ రవి కుమార్, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావ్, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, సర్పంచ్ గుర్రం లక్ష్మీ, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్, భక్తులు కన్యాలాల్ శ్యాంసుందర్ దేవ్డాపాల్గొన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద..: కౌటాల, ఏప్రిల్ 24 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహ ట్టి వద్ద ప్రాణహిత పుష్కరాలు భక్తులు పోటెత్తారు. చివరి రోజు దాదాపు 10 వేలకు పైగా భక్తులు తరలిరాగా.. ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 40వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి పసుపు కుంకుమ, దీపాలతో పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కౌటాల నుంచి తుమ్మిడిహట్టి పుష్కరఘాట్ వరకు ప్రత్యేక బస్సులు నడిపారు. భక్తులు సేద తీరేందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు.
పుష్కరాల్లో ఎమ్మెల్యే కోనప్ప దంపతులు, ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంత య్య, పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల గుప్తా, ఎంపీవో శ్రీధర్‌రాజు, సీఐ బుద్దే స్వామి, ఎస్ఐలు మనోహర్, ప్రవీణ్ కుమార్, రాజ్యలక్ష్మి, సర్పంచ్‌లు చరణ్‌దాస్, మౌనిష్, కుషబ్రావు, ఎంపీటీసీ మనీశ్, పండితులు సంతోష్ పాల్గొన్నారు.వేమనపల్లి వద్ద..: వేమనపల్లి, ఏప్రిల్ 24 : వేమనపల్లి వద్ద ప్రాణహిత నదిలో శనివారం వరకు 1.86 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించగా.. ఆదివారం ఒక్కరోజే 70 వేల మందికిపైగా భక్తులు వచ్చా రు.
మాజీ మంత్రి గడ్డం వినోద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ విజయరామారావు, మంచి ర్యాలలోని విశ్వనాథ ఆలయ ధర్మకర్త బోడ రీనారాణిదాస్-ధర్మేందర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరఘాట్ వద్ద నిత్యాన్నదానం నిర్వహించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, సర్పంచు కుబిడె మధూకర్‌ను రీనారాణిదాస్-ధర్మేందర్ దంపతులు సన్మానించారు.
అవాంఛనీయ ఘట నలు జరగకుండానీల్వాయి ఎస్ఐ నరేశ్ నిరంతరం పర్యవేక్షించారు. డీఎల్పీవో ఫణీం దర్, ఎంపీవో అనిల్‌కుమార్ పంచాయతీ కార్యదర్శుల తో కలిసి ఏర్పాట్ల ను పర్యవేక్షిం చారు. ఘాట్ నుంచి నది తీరానికి ఎడ్లబండ్లలో ప్రయా ణించి నది వరకు చేరుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, కొండగట్టు దేవస్థాన ఈవో వెంకటేశ్, చైర్మన్ స్వామి, రామకృష్ణ, అర్చకులు పుణ్యస్నానాలు ఆచరించి హారతి ఇచ్చారు. ఇక్కడ ఎంపీపీగణపతి, రైతు కో-ఆర్డి నేటర్ భీమయ్య, కో-ఆప్షన్ సభ్యుడు ముజ్జు, లక్ష్మీకాంత్, వెంకటేశం, లింగగౌడ్, సర్పంచ్‌లు కొండగొర్ల బాపు, శ్రీనివాస్, మోర్ల పద్మ, రాజేశ్వరి, తలండి స్వరూపరాణి, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బాపు, సంతోష్, రవి, రజోక్ పాల్గొన్నారు.
ప్రాణహిత పుష్కరాల్లో పంచాయతీరాజ్‌శాఖ పారిశుధ్యంపై దృష్టి సారించింది. నది, పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని ఏరివేశారు. ఎంపీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యదర్శుల పర్యవేక్షణలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి.
ప్రాణహిత పుష్కరాల్లో భక్తుల సేవల్లో పోలీసులు తరించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సహాయం అందించారు. జాగ్రత్తలు తెలియజేయడంతోపాటు తప్పిపోయిన వారి ఆచూకీ వారి కుటుంబ సభ్యులకు తెలిసేలా కృషి చేశారు. పార్కింగ్, పుష్కరఘాట్, ప్రధాన రోడ్లపై సహాయకారిగా వ్యవహ రించారు. లక్షల్లో భక్తులు రాగా ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. – కోటపల్లి, ఏప్రిల్ 24]
కోటపల్లి, ఏప్రిల్ 24 : పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల సందర్భంగా ప్రాణహిత నదిలో పవిత్ర స్నానం చేయడానికి అర్జునగుట్టకు కుటుంబంతో వచ్చాం. పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది. మహారాష్ట్రలో పుష్కరస్నానాలు జరుగుతున్నప్పటికీ అర్జునగుట్ట పుష్కరఘాట్‌కు అధిక మంది భక్తులు వస్తుండడంతో మేము కూడా వచ్చాం.
– సంతోషి అడుగుల్వార్, మహారాష్ట్ర
పన్నెండేళ్లకో సారి వచ్చే పుష్కరాల్లో తప్పకుండా పుణ్యస్నానం చేస్తాం. ఇప్పటికే గోదావరి, కృష్ణ పుష్కరాల సందర్భంగా పవిత్రస్నానం చేశా. ఇప్పుడు ప్రాణహితలో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చా. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట దూరంగా ఉన్నప్పటికీ సౌకర్యాలు బాగుండడంతో ఇక్కడికి వచ్చాం.
– రమ్యశ్రీ, హైదరాబాద్